Kakinada: పెళ్లి పేరుతో మహిళల మోసం.. బంగారం, నగదుతో పరార్! ట్విస్ట్ ఏంటంటే!

పెళ్లి పేరుతో మహిళల మోసం.. బంగారం, నగదుతో పరార్! ట్విస్ట్ ఏంటంటే!

Kakinada: ఈ మద్య డబ్బు సంపాదించాలనే యావతో ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. పెళ్లిలు, చిట్టీలు, స్కీమ్స్ ఎన్నో దందాలతో అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నారు.

Kakinada: ఈ మద్య డబ్బు సంపాదించాలనే యావతో ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. పెళ్లిలు, చిట్టీలు, స్కీమ్స్ ఎన్నో దందాలతో అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితం గడపాలని చూస్తున్నారు. ఇందుకోసం అక్రమాలు, అన్యాయాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తూ అడ్డగోలిగా డబ్బు సంపాదిస్తున్నారు. మోసం చేసిన వాళ్లు ఏంతో కాలం పోలీసుల నుంచి తప్పించుకోలేరు.. ఎక్కడో అక్కడ చిన్న తప్పు చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు.ఈ మధ్య కొత్త ట్రెండ్ కొనసాగుతుంది.. పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేస్తూ అందినంత బంగారం, నగదు తో ఉడాయిస్తున్నారు. పదకొండు మంది మహిళలు పెళ్లిపేరుతో అమాయకులను మోసం చేసి నిలువునా ముంచేస్తున్నారు. ఈ దందా కాకినాడలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

కాకినాడలో పెళ్లి పేరుతో 11 మంది మహిళలు బ్యాచ్ గా ఏర్పడి అమాయకులను బురిడీ కొట్టింది అందినంత దోచేస్తున్నారు. కాకినాడకు చెందిన కృష్ణ మోహన్ అనే బాధితుడు కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు. తనకు వయసు పెరిగింది. ఇక తనను ఎవరూ పెళ్లి చేసుకోరని భావించిన సమయంలో ఓ మహిళ వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పెళ్లి చేసుకొని నగదు, బంగారంతో ఉడాయించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాకినాడలో తాను ఒక గౌరవమైన పొజీషన్ లో ఉన్నానని. తాను మాత్రమే కాదు.. చాలా మంది ఉన్నతమైన పొజీషన్ లో ఉన్నారని.. వారిని టార్గెట్ చేసుకొని 11 మంది మహిళలు ట్రాప్ చేసి పెళ్లి పేరుతో పట్టు చీరలు, బంగారం కొనుగోలు చేస్తున్నారు. తాము నిరుపేదలం అని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని డబ్బులు కూడా తీసుకుంటున్నారు. తీరా పెళ్లి చేసుకొని మోసం చేసి పరారయ్యారని అన్నారు. తాము మోసపోయామని బయటకు చెప్పుకోలేని పరిస్థితి.

విచిత్రం ఏంటుంటే నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి అప్పటికే పెళ్లై ఒక పాప ఉంది. యువతి స్వస్థలం రాజమండ్రి అని చెప్పింది. వాస్తవానికి ఆమెది ఏలూరు, పెళ్లి పేరుతో కాకినాడలో 11 మంది మహిళలు ఇలాంటి ఘరానా మోసాలకు తెగబడుతున్నారు. రాజమండ్రిలో పెళ్లి బట్టలు కొన్నా, రూ.35 క్యాష్ ఇచ్చా, మరోసారి రూ.2 లక్షలు తీసుకున్నారు. పెళ్లికి ముందు రూ.2 లక్షల క్యాష్, 40 వేల బంగారు గొలుసు తీసుకున్నారు. నా డబ్బుతో ఫోన్ కూడా కొన్నారు. పెళ్లికి నా ఫ్రెండ్స్ వచ్చారు.. పెళ్లికి మధ్యవర్తులు వచ్చారు.. వారు కూడా డబ్బు తీసుకున్నారు. మొత్తానికి పెళ్లి పేరుతో నన్ను మోసం చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కృష్ణ మోహన్ ఎవరో తనకు తెలియదని యువతి చెబుతుంది. నేను ఒక్కదాన్నే ఉన్నాను.. నన్ను ఒంటరిగా రావాలని బెదిరిస్తున్నాడు. నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. నాకు అసలు పెళ్లే కాలేదు, పిల్లలు ఎలా పుడతారు? కావాలనే ఆయన నన్ను వేదిస్తున్నాడు అని చెప్పింది. నేను అసలు ఏ బంగారం షాపుకు వెళ్లలేదు, ఫోన్ కొనలేదు, డబ్బులు తీసుకోలేదని యువతి అంటుంది. మరి ఇందులో ఏది నిజం? ఏది అబద్దమో తెలియాల్సి ఉంది. ఇరు వర్గాల ఫిర్యాదులను పోలీసులు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments