బెజవాడ దుర్గమ్మకు అజ్ఞాతవాసి భారీ కానుక.. ఏకంగా 2.5 కోట్లతో బంగారు కిరీటం

Kanaka Durga Devi: దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఓ భక్తుడు ఏకంగా 2.5 కోట్లతో బంగారు కిరీటాన్ని బహూకరించాడు.

Kanaka Durga Devi: దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఓ భక్తుడు ఏకంగా 2.5 కోట్లతో బంగారు కిరీటాన్ని బహూకరించాడు.

ఇటీవల గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తులు. ఇక ఇప్పుడు దుర్గాదేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని కొలుస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. విజయ దశమికి ముందు దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో దుర్గా దేవీ వేడుకలను కన్నుల పండగగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు మండపాలను సిద్ధం చేశారు. అమ్మవారు కొలువుతీరనున్నారు.

పదిరోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇక దేవీ శరన్నవరాత్రోత్సవాలు అనగానే గుర్తోచ్చేది బెజవాడ కనకదుర్గమ్మ. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు నవ దుర్గలుగా వివిధ అవతారాల్లో తన భక్తులతో పూజలను అందుకోనున్నది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న కనకదుర్గమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తుంటారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇందకీలాద్రికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే మహిమగల తల్లీ అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శరన్నవరాత్రుల్లో దుర్గమ్మను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా అమ్మవారికి కానుకలు చెల్లించుకుంటారు. ఎవరికి తోచినంత వారు డబ్బు, నగల రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో ఓ అజ్ఞాత భక్తుడు కనకదుర్గమ్మకు భారీ కానుక అందజేశాడు. దుర్గాదేవీపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. ఏకంగా 2.5 కోట్లు విలువ చేసే బంగారు కిరీటాన్ని బహూకరించాడు. ఆ కిరీటం అంతా బంగారం, వజ్రాలతో దగదగ మెరిసిపోతున్నది. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు కనకదుర్గమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది. దుర్గమ్మ వజ్ర కిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నది. మరి అజ్ఞాత భక్తుడు బెజవాడ దుర్గమ్మకు బహూకరించిన భారీ కానకపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments