iDreamPost
android-app
ios-app

అమ్మవారికి ఫ్రాక్ ధరింపజేసిన పూజారీ.. భక్తులు ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ సమయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారు. కాాగా,

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ సమయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారు. కాాగా,

అమ్మవారికి ఫ్రాక్ ధరింపజేసిన పూజారీ..  భక్తులు ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రీతి పాత్రమైన పండుగల్లో ఒకటి దసరా. తెలంగాణ, ఏపీల్లో బతుకమ్మతో పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతుంటాయి. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తుంది జగన్మాత. వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో దేవిని కొలుస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని తిలకించి పులకరించి పోతుంటారు. అత్యంత భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తారు. నైవేద్యాలను సమర్పించి.. ఆ తర్వాత భక్తులు స్వీకరిస్తారు. అటు ఏపీలోనే కాక, ఇటు తెలంగాణలో దేవాలయాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  క్రమంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు ఓ పూజారీ.  అసభ్య పదజాలంతో విరుచు పడ్డాడు. దీంతో ఫైర్ అవుతున్నారు మహిళా భక్తులు.

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిమిషాంబికా దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల నుండి అమ్మవారు పూజలు అందుకుంటుంది. ఈ క్రమంలో బాల త్రిపురి సుందరి దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు నిమిషాంబికా. ఆమెను తిలకించేందుకు భక్తులు గుడికి వచ్చారు. కానీ అమ్మవారిని చూడగానే.. షాక్ తిన్నారు. పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా వెలుగొందాల్సిన దేవీ విగ్రహానికి గౌను ధరించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అమ్మవారికి ఫ్రాక్ ధరింపజేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అపచారం జరిగిందంటూ ఆందోళన చెందారు. పూజారీ చర్యపై మహిళలు మండిపడ్డారు. అర్చకుడిని నిలదీసి అడుగగా.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళలకు దురుసుగా సమాధానం చెప్పారు పూజారి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఓ మహిళా భక్తురాలు.. త్రిపుర సుందరి దేవీ రూపం అంటే ఎలా ఉంటుందో తెలుసా..? మీకు తెలియందని కాదు.. ఇలా అమ్మవారికి ఫ్రాక్ తొడుగుతారా అంటూ ప్రశ్నించింది. దీంతో పూజారీ.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ‘శాస్త్రం నీకు తెలుసా..? బాలా త్రిపుర సుందరి దేవీ రూపంలో ఉంది.. దుస్తులు విప్పి లేదు. జుట్టు విరబూసుకొని లేదు. గాజులు లేకుండా లేదు’ అంటూ మహిళపై విరుచుకు పడ్డారు. కాగా, పూజారీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడుతున్నారు నెటిజన్లు. అతడు మాట్లాడుతున్న భాష వినడానికి చాలా అసహ్యంగా ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు. బాల త్రిపుర సుందరి ఆకారంలో చీర కట్టించకుండా ఫ్రాక్ ఎలా వేస్తారంటూ నిలదీసిన మహిళలపై పూజారి దురుసుగా సమాధానం ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దసరా సమయంలో అమ్మవారికి అపచారం జరిగిందంటూ ఆందోళన చెందుతున్నారు.