Arjun Suravaram
Arjun Suravaram
సాధారణంగా మాట ఇవ్వడం, మర్చిపోవడం, ప్రజలు గుర్తు చేసిన పట్టించుకోకపోవడం కొందరు ప్రజాప్రతినిధులకు అలవాటు. అయితే అందుకు భిన్నంగా ఇచ్చిన మాటమీద నిలబడే ప్రజాప్రతి నిధులు కూడా ఉంటారు. తాము ఎన్నికలకు ముందు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో.. దానిని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తారు. అలాంటి వారి జాబితాలో ఉన్నారు కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. ఆమె పత్తికొండ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల దారిద్య్రాన్ని తొలగించారు. తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యేకు ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పత్తికొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగాటి శ్రీదేవి.. ఆ నియోజకవర్గంలోని గ్రామాల ప్రజల కష్టాన్ని విన్నారు. తాను గెలిచిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. అంతేకాక ముఖ్యంగా దూదేకొండ-కొత్తపల్లి బ్రిడ్జిని నిర్మిస్తామని ఆమె హామి ఇ్చచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. త్వరలోనే ఈ వంతెనను ప్రారంభించనున్నారు. పత్తికొండ మండలం దూదేకొండ-కొత్తపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగుపై లోలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.62 కోట్ల ఏపీఆర్ఆర్సీ నిధులు మంజూరయ్యాయి.
ఈ నిధులతో వంతెనకు రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును వేశారు. ఈ బ్రిడ్జీ , రోడ్డు నిర్మాణం పూర్తైన నేపథ్యంలో ఈ గ్రామాల మీదుకు వెళ్లేందుకు మార్గం సులభమైంది. మరో రెండు వంతెనల నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ రాజ్ ఇంజినీర్లు రూ.8.10 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అలానే పత్తికొండ నియోజక వర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీదేవి చర్యలు చేపట్టారు. ఇవి కూడా త్వరలో పూర్తవుతాయని స్థానికులు అంటున్నారు. మరి..మాట ఇచ్చి తప్పించుకునే నేతలు ఉన్న కాలంలో మాట మీద నిలబడిన ఎమ్మెల్యే శ్రీదేవిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియేజేయండి.