iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

  • Published Oct 07, 2023 | 12:34 PM Updated Updated Oct 07, 2023 | 12:34 PM
  • Published Oct 07, 2023 | 12:34 PMUpdated Oct 07, 2023 | 12:34 PM
బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం  ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇటీవల జనసేన సైతం దూకుడు పెంచి.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుక పడుతుంది. ఇది ఇలా ఉంటే.. చంద్రబాబు అరెస్ట్ అంశంపై చాలా తక్కువ మంది ప్రముఖులు మాత్రమే స్పందించారు. అయితే బాబు అరెస్ట్ పై సినిమా వాళ్లు స్పందించకపోవడంపై మీ అభిప్రాయం ఏంటని మీడియా అడిగిన ప్రశ్నలకు.. “ఎవరు ఖండిచపోయిన పట్టించుకోను” అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే.  అయితే ఆయన అరెస్ట్ పై సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా ఉండే అశ్వనీదత్, మురళీ మోహన్, రాఘవేంద్ర రావు లాంటి వాళ్లు మాత్రమే ఖండించారు.  కీలకమైన టాలీవుడ్ ప్రముఖులెవ్వరూ స్పందించలేదు. పై పెచ్చుగా రాజకీయ అంశాలపై స్పందించాల్సిన అవసరం లేదనే విధంగా నిర్మాత సురేష్ బాబు  లాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రెండు రోజుల క్రితం బాలకృష్ణ తనదైనశైలిలో స్పందించారు. ” ఎవరు ఖండించకపోయినా పట్టించుకోను. ఇది సినిమా రంగానికి సంబంధించినది కాదని అనడం తప్పు.  వాళ్లు కూడా పౌరులే కదా?. వాళ్లను నా సెక్షన్ నుంచి తీసేశాను” అంటూ రియాక్ట్ అయ్యారు.

అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. బాలయ్య వ్యాఖ్యలను పరోక్షంగా తప్పు పడుతూ.. ఇండస్ట్రీని వెనకేసుకొచ్చారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీపై పూర్తిగా ఒత్తిడి ఉందని, ప్రస్తుతం పరిస్థితుల్లో స్పందించడానికి కూడా వాళ్లు భయపడుతున్నారని అన్నారు. ఇకపై  చంద్రబాబు అరెస్ట్ పై స్పందించమంటూ సినీ ఇండస్ట్రీలో ఎవర్వర్నీ అడగొద్దని పరోక్షంగా మీడియాకు పవన్ సూచించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి.. బాలకృష్ణ వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet