Arjun Suravaram
Tanuku: ఏపీలో టికెట్ వ్యవహారం టిడీపీ, జనసేనలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వివిధ నియోజవర్గాల్లో టికెట్ల విషయంలో ఇరుపార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఓ నియోజవర్గంలో ఈ వార్ మరోసారి బయటపడింది.
Tanuku: ఏపీలో టికెట్ వ్యవహారం టిడీపీ, జనసేనలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వివిధ నియోజవర్గాల్లో టికెట్ల విషయంలో ఇరుపార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఓ నియోజవర్గంలో ఈ వార్ మరోసారి బయటపడింది.
Arjun Suravaram
దేశ వ్యాప్తంగా 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఎంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఆ ఉత్కంఠ మరీ పీక్ స్టేజికి చేరుకుంది. ఎన్నికల అతి దగ్గరలో ఉండటంతో ఏపీలో రాజకీయ చాలా రసవత్తరంగా సాగుతోంది. అధికార వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న అందరి దృష్టి టీడీపీ, జనసేన సీట్ల పంపకం, అభ్యర్థుల ప్రకటన పైనే ఉంది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.. అభ్యర్థులపై ఇరు పార్టీల అధినేతలు స్పష్టత ఇవ్వలేదు. ఇదే సమయంలో క్షేత్ర స్థాయిలో నేతలు టికెట్ తమకంటే తమకని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉన్నప్పటికి.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ నియోజవర్గంలోని టీడీపీ, జనసేన కోల్డ్ వార్ పీక్ స్టేజికి చేరింది.
2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. టీడీపీ, జనసేనాలు కూటమిగా బరిలో దిగనున్నాయి. ఇంకా బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే వారితో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు సీట్ల విషయంపై జనసేన, టీడీపీ కలిసి చర్చించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతలు టికెట్ నాకంటే, నాకు అని ప్రచారం చేసుకుంటున్నారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇరుపార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు. గతంలో తణుకులో వారాహి యాత్ర నిర్వహించిన సమయంలో పవన్ ఈ ప్రకటన చేశారు. వారాహి యాత్రలో 2019 వివిధ కారణాలతో రామచంద్రరావుకు ఇవ్వలేదని, దీంతో ఈసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తాడని పవన్ పరోక్షంగా తెలిపారు.
అలానే ఏపీ డెవలప్మెంట్ స్కిల్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. రాజమండ్రి నుంచి విజయవాడకు వచ్చే క్రమంలో ఎక్కడ, ఏ నాయకుడితో మాట్లాడని బాబు..తణుకు వద్ద మాత్రం తన కారు ఆపి..రామచంద్రరావును పిలిచి మరీ పలకరించారు. అంతేకాక ఆయనను భుజం తట్టడం ఆ సందర్భంలో కనిపించింది. దీంతో తణుకు టికెట్ విడివాడ రామచంద్రరావుకే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తుణుకు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా తానే బరిలో దిగుతానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా తణుకు నియోజవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పవన్ పర్యటన జరగనున్న నేపథ్యంలో మరోసారి ఈ కోల్డ్ వార్ బయటపడింది.
తణుకులో తమకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేదే లేదని టీడీపీ తమ్ముళ్లు అంటున్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యనటలో భాగంగా.. ఆ జిల్లా అధ్యక్షురాలు తోట రామలక్ష్మి నివాసం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తరువాత మాజీ ఎమ్మెల్యేతో భేటి కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రకటన చేస్తారు అనేదానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన ఎన్ని సీట్లు దక్కించుకోనుందనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. అలానే ప్రస్తుతం తణుకు టికెట్ ఎవరికి ఇస్తారు అనే హట్ చర్చ అయితే ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. మొత్తంగా తణుకు అసెంబ్లీలో జనసేన, టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ మాత్రం పీక్ స్టేజ్ కి చేరిందని, ఎవరికి టికెట్ కేటాయించిన మరొకరు రచ్చ చేసేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది.