తొలి ఏకాదశి పండుగా ముందు శ్రీశైలంలో మహా అద్భుతం

సాధారణంగా హిందు సంప్రదాయం ప్రకారం.. ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి పండుగ హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. అయితే ఈ తొలి ఏకాదశి పండుగ ముందు తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రలోని ఓ ఆలయంలో మహా అద్భుతం చోటు చేసుకుంది. దీంతో ప్రజలు ఆ అద్భుతన్ని తరించుటకు తండోపతండోలుగా ఆలయానికి తరలి వెళ్లారు.

సాధారణంగా హిందు సంప్రదాయం ప్రకారం.. ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి పండుగ హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. అయితే ఈ తొలి ఏకాదశి పండుగ ముందు తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రలోని ఓ ఆలయంలో మహా అద్భుతం చోటు చేసుకుంది. దీంతో ప్రజలు ఆ అద్భుతన్ని తరించుటకు తండోపతండోలుగా ఆలయానికి తరలి వెళ్లారు.

భారత దేశంలో  హిందువులు అనేక రకాల పండగలను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా వాటిలో  శివరాత్రి, తొలిఏకాదశి, వినయక చవితి, దసరా ఇలా అనేక రకాల పండుగలను ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఇది ఇలా ఉంటే.. ఇలా పండగల సమయంలో కొన్ని కొన్ని ప్రాంతల్లో అక్కడక్కడ అద్భుతాలు, అరుదైన ఘటనలు చోటుచేసుకుంటాయి.  ముఖ్యంగా దేవలయాల్లో పాము ప్రదక్షణ చేయడం,  మూగజీవాలు దేవుళ్లను పూజించడం వంటి వింతైన ఘటనలు చోటుచేసుకుంటాయి. అలానే తాజాగా తొలిఏకాదశి పండగ జరగనున్న నేపథ్యంలో శ్రీశైలంలో ఓ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

సాధారణంగా హిందు సంప్రదాయం ప్రకారం.. ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి పండుగ హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. అయితే ఈ ఏకాదశిని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ముఖ్యంగా హిందువులకు ఈ ఏకాదశి నుంచే పండుగల్ని మొదలువుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగగా భావిస్తారు. ఇక ఈ పండుగ రోజున ఉపవాసం ఉంటూ, భక్తి శ్రద్ధలతో దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాది ఈ తొలి ఏకాదశి అనేది బుధవారం 17వ తేదీన పడుతుంది.అయితే ఈ తొలి ఏకాదశి పండుగ ముందురోజునే ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఓ మహా అద్భుతం చోటు చేసుకుంది. ఓ నాగ పాము శివ లింగాన్ని చూట్టుకుంటూ భక్తులకు దర్శనిమిచ్చింది. ఇంతకి ఈ అద్భుతమైన ఘటన ఎక్కడ జరిగిందంటే..

ప్రముఖ పుణ్యక్షేత్రల్లో ఒకటైన శ్రీశైలంలోని మహా అద్భుతం జరిగింది. పాతాళగంగ రోడ్డు మార్గంలోని ఉన్న వజ్రమ్మ గంగమ్మ సమీపంలో ఓ శివాలయం ఉంది. కాగా, అక్కడ నిత్యం శివుడికి అభిషేకాలు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎప్పటిలానే 2024, జూలై 16వ తేదీ ఉదయం ఆ శివ లింగానికి భక్తులు అభిషేకం చేయాలని ఆలయానికి తరలివచ్చారు. అయితే అక్కడ వాళ్లకు ఓ మహా అద్భుతం కనిపించింది. ఆలయంలో శివ లింగాన్ని చుట్టుకొని ఉన్న ఓ నాగు పాము కనిపించింది. ముఖ్యంగా ఆ పాము అటూ ఇటూ కదులుతూ నాట్యం చేయటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక ఇదంతా చూసిన భక్తులు తొలి ఏకాదశి పండుగ ముందు రోజునే ఇలాంటి మహా అద్భుతం జరిగిందని, ఇదంతా శివుని లీలా అంటూ అక్కడ పెద్ద ఎత్తునే ఆ పరమేశ్వరుడుని స్మరించారు. దీంతో ఆ ఆలయం శివ నామ స్మరణతో మారు మోగిపోయింది. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో ఆ గుడికి భక్తులు పెద్ద సంఖ్యల్లో తరలి వెళ్లారు. ఇకపోతే సుమారు ఆ నాగు పాము అర గంట సమయం కంటే ఎక్కువగానే ఆ శివ లింగం చుట్టుకొని ఉంది. అయితే.. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని స్థానికులు చెప్పారు. ముఖ్యంగా శివుడి మెడలో ఉండే ఆ నాగ దేవతే ఇవాళ స్వయంగా భక్తులకు ప్రత్యక్ష్యం అయ్యిందంటూ భక్తులు చర్చించుకోవటం గమన్హారం.

Show comments