రైతులకు గుడ్ న్యూస్.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తనదైన పరిపాలనతో ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం పలు రకాల పథకాలను తీసుకొచ్చారు. అలానే అనేక సంస్కరణలతో తీసుకొచ్చి.. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించారు. అంతేకాక రైతుల కోసం కూడా పలు రకాల పథకాలను ప్రవేశపెట్టారు. వారికి పెట్టుబడి సాయం  అందించేందుకు వైఎస్సాఆర్ రైతు భరోసాను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటికే పలు విడతల్లో నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. తాజాగా కౌలు రైతుకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. సీఎం జగన్‌ అర్హులైన కౌలు రైతుల  అకౌంట్లలో నేరుగా నగదును జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఈ సాయం అందనుంది. రేపు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. నిధుల విడుదల ఇలా ఉండగా.. రాష్ట్రంలోని కౌలు రైతులకు పెద్ద ఎత్తున కౌలు కార్డులను జారీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చెేపట్టింది.

క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్  మేళాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున కౌలు కార్డులను జారీ చేసింది. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహించేలా  వ్యవసాయ, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించింది. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో  ఆ రైతులందరికి పంట సాగు హక్కు పత్రాలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. మరి.. సీఎం జగన్.. కౌలు రైతుల అకౌంట్ల నగదు జమ చేయనుండంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయేండి.

Show comments