iDreamPost

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు: సజ్జల

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు: సజ్జల

ఏపీలో ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉంది. ఈక్రమంలో అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హీట్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. దొంగ ఓట్ల ఎక్కించడంలో చంద్రబాబు ఛాంపియన్ అంటూ వైసీపీ నేతలు విమర్శించారు. తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్టారెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు.  ఢిల్లీలో చంద్రబాబు ఏపీ పరువుతీస్తున్నారని, ఆయన బఫూన్ కు ఎక్కువ, జోకర్ కి తక్కువ అంటూ సజ్జల సంచలన కామెంట్స్ చేశారు.

బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడురు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సజ్జల ఫైర్ అయ్యారు.  చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారని, జేపీ నడ్డ దగ్గర వంగి వంగి.. నంగి నంగి మాట్లాడుతున్నారని  ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై 70 శాతం ప్రజలు పాజిటీవ్ గా ఉన్నారని ఆయన తెలిపారు. రాజకీయాలు అంటే ప్రజల బాగుండేలా ఉండాలని సజ్జల హితవు పలికారు.

ఇంకా ఆయన సజ్జల మాట్లాడుతూ…”చంద్రబాబు ఢిల్లీ వెళ్లి హడావిడి చేస్తున్నారు. పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు. తిట్టిన నోటితేనే మళ్లీ బీజేపీని బాబు పొగుడుతున్నారు. చంద్రబాబు బఫూన్ కు ఎక్కువ.. జోకర్ కి తక్కువ. ఢిల్లీలో  చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలకు  ఏం చేస్తారో చంద్రబాబు  చెప్పాలి. ఇక ఆయన తనయుడు లోకేశ్ చేస్తున్న పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలే రావడం లేదు. అంతేకాక అసలు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో చంద్రబాబుకు క్లారిటీ లేదు. ప్రజలను భ్రమల్లో పెట్టాలనుకునే వాళ్లే.. భ్రమల్లోనే ఉంటారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారు.

ఎన్టీఆర్ గారి రూ.100 నాణే విడుదల కార్యక్రమంలో ఆయన సతీమణి లక్ష్మీ పార్వతిని అవమానించారు. అవసరం ఉన్నప్పుడల్లా ఇప్పటికీ ఎన్టీఆర్ ను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ లా మారారు. ఆమెను, పవన్ కల్యాణ్ ను అడ్డం పెట్టుకుని బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు ఏం.. ఏం మాట్లాడుతున్నారో.. అవన్నీ వాస్తవానికి బాబుకే వర్తిస్తాయి. అసలు 2019 వరకు చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి” అని సజ్జల అన్నారు. మరి.. సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి