వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై CM జగన్ కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ఏపీ గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందని సీఎం జగన్ తెలిపారు. కేంద్రం మద్దతుతో, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోందని సీఎం జగన్ తెలిపారు.

సీఎం జగన్ మాట్లాడుతూ..” మా ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మొదట్లో ఏపీలోని 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు.. నేడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా… మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50 కి తగ్గింది.  ఏపీకి పొరుగు రాష్ట్రాలతో  పటిష్టమైన సమన్వయం ఉంది. నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌లు  ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు మాకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్కఫోర్స్‌ ద్వారా పరస్పరం పంచుకుని, సమిష్టిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం” అని సీఎం జగన్ తెలిపారు. అంతేకాక మరికొన్ని అంశాలను కూడా సీఎం జగన్ ప్రస్తావించారు.  మరి.. వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై  సీఎం జగన్ కీలక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments