ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించడం కోసం అనేక రకాల సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. తరచూ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం అవుతూ.. వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. అంతేకాక వారి సమస్యలకు వెంటనే పరిష్కరిస్తున్నారు. మీ మనస్సు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదంటూ సీఎం జగన్ అన్నారు. ముస్లిం నాయకులు, మత పెద్దలతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ఏపీలోని ముస్లిం పెద్దలు, మత గురువులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై సీఎంకు తమ అభిప్రాయాలను పెద్దలు తెలిపారు. అదే విధంగా సీఎం జగన్ మాట్లాడుతూ… “ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్జీల ప్రభుత్వం. కాబట్టి మీరు ఎలాంటి భయాలకు గురి కావాల్సిన అవసరం లేదు. మీ మనస్సును బాధ పెట్టేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదు” అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..” ఉమ్మడి పౌరస్మృతి అంశం మీద ఇప్పటి వరకూ డ్రాఫ్ట్ అనేది రాలేదు. అందులో ఏ అంశాలు ఉన్నాయో, ఉంటాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ మీడియాల్లో, పలు చోట్ల మాత్రం చర్చ విపరీతంగా నడుస్తోంది.
వాటిని చూసిన ముస్లింలు పెద్ద ఎత్తున తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంశాలను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. నా స్థానంలో మీరే ఉంటే ఏం చేసేవారన్నదానిపై నాకు సలహాలు ఇవ్వండి. ఇక్కడ మరొక విషయం మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ముస్లిం ఆడపిల్లల హక్కల రక్షణ విషంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ ఓ పెద్ద ప్రచారమే నడుస్తోంది. ఇలాంటి వాటిని మత పెద్దలే తిప్పికొట్టాలి. మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మనమంతా స్పష్టం చేద్దాం” అని సీఎం పేర్కొన్నారు. మరి.. ముస్లిం పెద్దల సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు!