iDreamPost
android-app
ios-app

పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు!

పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో రాజకీయం నిప్పుల సుడిగుండాన్ని తలపిస్తుంది. అధికార, ప్రతిపక్షాల నుంచి మాటల వేడి తీవ్ర స్థాయిలో ఉంది.  ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ వేడిగా ఇంకా పెరిగింది. ఇప్పటి వరకు అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య వార్ అన్నట్లు సాగింది. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో సీన్ మారింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయం వైసీపీ, జనసేన  అన్నట్లు సాగుతోంది. ప్రభుత్వం పవన్ విరుచక పడుతుంటే.. ఆయనపై మంత్రులు, ఇతర వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ప్రతి స్పందిస్తున్నారు.

మంగళవారం ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొన్న పవన్ పై పర్యాటక శాఖ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ దళపతి కాదని, దళారి అంటూ మండిపడ్డారు. బుధవారం ఏపీ మంత్రి  రోజా మీడియాతో మాట్లాడుతూ..” పవన్ కల్యాణ్ కాపులకు, జనసేన కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలి.  చంద్రబాబు కోసం పవన్ ఢిల్లీలో దళారిగా మారాడు. తన తల్లిని తిట్టిన వాడి కోసం పవన్ కల్యాణ్ దళారిగా మారడం సిగ్గు చేటు. సిగ్గులేకుండా మూడు పార్టీలతో కలసి పోటీ చేస్తామని పవన్ అంటున్నాడు. ప్రధాని మోదీని తిట్టిన చంద్రబాబుని ఎన్డీయే మీటింగ్ కి పిలవలేదు. కానీ పవన్.. తన తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం కలిసిపోయాడు.

పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక పవన్ తిరిగి టీడీపీ, బీజేపీతోనే కలిసిపోయాడు. పవన్ కేవలం మీడియా ముందే హీరో.. రాజకీయాల్లో జీరో. గతంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోను.. గొంతుకోసుకుంటా అన్నాడు. నేడు మాత్రం పొత్తులు అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. చంద్రబాబు ఎన్ని లేఖలు రాసినా ఎన్డీయే సమావేశానికి టీడీపీకి పిలుపు రాలేదు. చంద్రాబాబు ఊసరవెల్లి అనే విషయం బీజేపీకి బాగా తెలుసు. గతం ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానన్న బాబు.. ఆ పార్టీ కూడా మోసం చేశారు” అంటూ పవన్, చంద్రబాబులపై మంత్రి రోజా సీరియస్ అయ్యారు. మరి… పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  CM జగన్‌తో రహేజా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ భేటీ.. రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టుబడులు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom