iDreamPost
android-app
ios-app

దళిత రైతులకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త.. ఇక మీదట ఆ భూములపై..!

  • Author singhj Published - 05:08 PM, Fri - 17 November 23

ఏపీలోని దళితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక మీదట ఆ భూముల విషయంలో వాళ్లు బేఫికర్​గా ఉండొచ్చు.

ఏపీలోని దళితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక మీదట ఆ భూముల విషయంలో వాళ్లు బేఫికర్​గా ఉండొచ్చు.

  • Author singhj Published - 05:08 PM, Fri - 17 November 23
దళిత రైతులకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త.. ఇక మీదట ఆ భూములపై..!

ఆంధ్రప్రదేశ్​ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ నూజివీడులో పర్యటించారు. అసైన్డ్ భూముల పట్టాలను అర్హులకు పంపిణీ చేశారాయన. అన్నదాతల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారాయన. ఎన్నో దశాబ్దాలుగా అనుభవదారులుగా ఉన్న రైతులకు హక్కులు కల్పిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలోని 10,303 మందికి 12,886 ఎకరాల ల్యాండ్​ను శాశ్వత హక్కుతో అందించారాయన. జిల్లాలోని 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33 ఎకరాలను మంజూరు చేశారు ముఖ్యమంత్రి.

నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో నుంచి పేదలకు భూముల పంపిణీని మొదలుపెట్టారు సీఎం జగన్. ఇదే వేదిక మీద నుంచి అసైన్డ్ ల్యాండ్స్​కు యాజమాన్య హక్కుల్ని కల్పించడంతో పాటు లంక భూములకు పట్టాలనూ అందజేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ భూ సర్వే చేస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు విడతల సర్వే పూర్తయిందని.. త్వరలో మూడో విడత కూడా ప్రారంభించబోతున్నామని చెప్పారు. 27.42 లక్షల ఎకరాలకు సంబంధించి 16.21 లక్షల మంది రైతులకు హక్కులు కల్పించబోతున్నామని జగన్ పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో అసైన్డ్ భూములను అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకునేవారని సీఎం జగన్ దుయ్యబట్టారు. బాబు చుక్కల భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఫైర్ అయ్యారు. ఇదే వేదిక మీద నుంచి రాష్ట్రంలోని దళితులకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూముల మీద దళిత రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ భూములపై వారికి సర్వహక్కులు కల్పించబోతున్నామని చెప్పుకొచ్చారు. లంక భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు మూడు కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యామని జగన్ వెల్లడించారు.

చుక్కల భూములు, షరతులు కలిగిన పట్టా భూములతో పాటు ఇనాం భూముల్ని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నట్లు నూజివీడు సభలో పేర్కొన్నారు సీఎం జగన్. అలాగే భూమి కొనుగోలు స్కీమ్ కింద ఇచ్చిన ల్యాండ్స్​ మీద హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్​ఓఎఫ్​ఆర్ పట్టాల పంపిణీని ఇదే సభలో ఆయన ప్రారంభించారు. అన్నదాతల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ కొత్తగా డీకేటీ పట్టాలను తాము అందిస్తున్నామని వివరించారు జగన్. భూ తగాదా సమస్యలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులను కూడా అప్​డేట్ చేస్తున్నామని వెల్లడించారు. వేలాది మంది సర్వేయర్లతో స్పీడ్​గా సర్వే చేపడుతున్నామని తెలిపారు. సర్వే కంప్లీట్ అయిన తర్వాత గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు జగన్.

నూజివీడు సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి జగన్. బాబు తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే జరిగిందని ఫైర్ అయ్యారు. జనాలకు మంచి చేసి బాబు ఎప్పుడూ ముఖ్యమంత్రి కాలేదన్నారు. ఫస్ట్ టైమ్ వెన్నుపోటుతో, సెకండ్ టైమ్ కార్గిల్ వార్ పుణ్యాన.. మూడోసారి రుణమాఫీ హామీతో పవర్​లోకి వచ్చారన్నారు జగన్. త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రజలు గుర్తుతెచ్చుకోవాలన్నారు.

ఇదీ చదవండి: కొట్టుకుంటున్న TDP-జనసేన నేతలు.. పొత్తు చిత్తయినట్లేనా?