iDreamPost

కొట్టుకుంటున్న TDP-జనసేన నేతలు.. పొత్తు చిత్తయినట్లేనా?

  • Published Nov 17, 2023 | 2:19 PMUpdated Nov 17, 2023 | 2:19 PM

టీడీపీ-జనసేన మధ్య పొత్తు ప్రకటన వెలువడిన నాటి నుంచి అందరి మనసులో ఒక్కటే అనుమానం.. దీన్ని కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆమోదిస్తారా అని. అయితే తాజాగా సమన్వయ కమిటీ సమావేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. పొత్తు చిత్తయినట్లే కనిపిస్తుంది అంటున్నారు జనాలు. ఎందుకంటే..

టీడీపీ-జనసేన మధ్య పొత్తు ప్రకటన వెలువడిన నాటి నుంచి అందరి మనసులో ఒక్కటే అనుమానం.. దీన్ని కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆమోదిస్తారా అని. అయితే తాజాగా సమన్వయ కమిటీ సమావేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. పొత్తు చిత్తయినట్లే కనిపిస్తుంది అంటున్నారు జనాలు. ఎందుకంటే..

  • Published Nov 17, 2023 | 2:19 PMUpdated Nov 17, 2023 | 2:19 PM
కొట్టుకుంటున్న TDP-జనసేన నేతలు.. పొత్తు చిత్తయినట్లేనా?

వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ సాక్షిగా టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. ఇరు పార్టీల కార్యకర్తలు, నేతలు కలిసి పోయి పని చేయాలని సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. అధిష్టానం సూచనలను కార్యకర్తలు, నేతలు పట్టించుకోవడం లేదని అర్థం అవుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని జనసేన కార్యకర్తలు అస్సలు స్వాగతించలేకపోతున్నారు. దీనిపై కొందరు బహిరంగంగానే విమర్శలు చేశారు. వారి మీద జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చర్యలు తీసుకున్నారు. పొత్తు వద్దనుకునేవాళ్లు.. బయటకు వెళ్లి పోవచ్చని డైరెక్ట్‌గానే చెప్పారు. ఇక ఇరు పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో నియోజకవర్గాల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నాయి టీడీపీ-జనసేన. అయితే ఈ సమావేశాలు కాస్త రణరంగంగా మారుతున్నాయి.

సమన్వయ సమావేశాల్లో టీడీపీ, జనసేన నేతలు పరస్పరం బూతులు తిట్టుకుంటూ.. కొట్టుకుంటున్నారు. కుర్చీలు, బల్లలు విసిరేస్తూ.. సమావేశ ప్రాంగణాన్ని రణరంగంగా మారుస్తున్నారు. పిఠాపురం, విశాఖ జిల్లాల్లో సమన్వయ సమావేశంలో ఇరు పార్టీల నేతలు కొట్టుకోగా.. తాజాగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఎన్నికల్లో రెండు పార్టీలు కలికి కట్టుగా పని చేసి జగన్‌కు చెక్‌ పెట్టాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఆశిస్తుంటే.. వారి కార్యకర్తలు మాత్రం.. అందుకు ఏమాత్రం సిద్ధంగా లేరని.. సమన్వయ సమావేశాల్లో సీన్‌ చూస్తే అర్థం అవుతుందని అంటున్నారు రాజకీయ పండితులు. వాస్తవంగా చెప్పాలంటే.. జనసేనకు రాష్ట్రవ్యాప్తంగా బలం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ పార్టీకి.. అందునా సామాజిక పరమైన బలం మాత్రమే ఉంది.

జనసేనకు కాస్తో కూస్తో బలమున్న నియోజకవర్గాల్లో తమకు లాభం చేకూరుతుందనే ఉద్దేశంతోనే.. టీడీపీ, గ్లాస్‌ పార్టీతో పొత్తుకు రెడీ అయ్యిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ప్రస్తుతం ఈ బలమే ఇరు పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది అంటున్నారు. ఎక్కడైతే జనసే, టీడీపీ రెండు పార్టీల ప్రభావం ఉందో.. అక్కడే గొడవలు అవుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయా స్థానాల్లో ఇరు పార్టీల నేతలు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తున్నారు.

దాంతో తమ బలాన్ని ప్రదర్శించడం కోసం చేసే ప్రయత్నాలు కాస్త.. చివరకు కొట్టుకునేదాకా వెళ్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగ్గంపేట సమావేశంలో చోటు చేసుకున్న రసాభసానే ఇందుకు ఉదాహరణ అంటూ ప్రస్తావిస్తున్నారు. జగ్గంపేట సీటు తమదే అని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన కామెంట్‌ రచ్చకు దారి తీసిన సంగతిని గుర్తు చేస్తున్నారు.

టీడీపీతో పొత్తు.. ఆందోళనలో జనసేన నేతలు..

అంతేకాక టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత జనసేన నేతల్లో ఒకరకమైన ఆందోళన ప్రారంభం అయ్యింది అంటున్నారు రాజకీయ పండితులు. పొత్తు ప్రకటన కన్నా చాలా కాలం ముందు నుంచే పలువురు జనసేన నేతలు ఈ సారి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్నారు. అంతేకాక నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. అయితే టీడీపీతో పొత్తు ఖాయం కావడంతో.. ప్రస్తుతం ఆ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

తమ బలాన్ని సాకుగా చూపి.. టీడీపీ నేతలు తమకు టికెట్‌ రాకుండా అడ్డుకుంటారని.. జనసేన నేతలు ఆందోళన పడుతున్నారట. తమను కాదని తెలుగుదేశం నేతలకు టికెట్లు కేటాయిస్తే.. మద్దతిచ్చేది లేదని.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులగా బరిలో దిగుతామని పలువురు జనసేన నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారట. తాము పల్లకీలు మోయడానికి మాత్రమే లేమని.. తమకు పదవులు కూడా కావాలని గట్టిగానే డిమాండ్‌ చేస్తున్నారట.

ఈ పరిణామాలన్నింటిని పరిశీలించిన రాజకీయ పండితులు.. ఇప్పుడేముంది.. ముందుంది అసలు పండగ.. రేపు సీట్ల సంఖ్య, నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటన వెలువడ్డాకా.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఓ రేంజ్‌లో గొడవలు అవుతాయని.. చాలా మంది పార్టీలకు ఎదురు తిరుగుతారని అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ-జనసేన ఏ ప్రయోజనాలను ఆశించి పొత్తు పెట్టుకుందో.. అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు తలెత్తుతాయని అంటున్నారు రాజకీయ పండితులు. వీరి కొట్లాట చూసిన జనాలు కూడా ఇలానే ఉంటే పొత్తు చిత్తవ్వడం ఖాయమని కామెంట్స్‌ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి