ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాల లాయర్లు కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. మరోవైపు లోకేశ్.. చంద్రబాబు కేసు విషయమై.. కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే లోకేశ్ పారిపోయాడని వైసీపీ నేతలు ఆరోపించారు. చాలా రోజుల తరువాత మంగళవారం లోకేశ్ మీడియా ముందుకు వచ్చారు. జగన్ రెడ్డికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ హాట్ కామెంట్స్ చేశాడు. అయితే లోకేశ్ చెప్పిన ఈ మాటలే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నారా లోకేశ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో A 14గా లోకేశ్ పేరు సీఐడీ చేర్చారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేకుంటే.. ఇక స్కాం ఎక్కడ జరిగిందీ అంటూ లోకేశ్ అన్నారు. ఇది జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని, నన్ను దమ్ముంటే అరెస్టు చేయ్యండి అంటూ ఆవేశంగా ప్రసంగించారు. అంతేకాక త్వరలో జగన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ మండిపడ్డారు. అయితే లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం తమ దయనీయ పరిస్థితులకు కారణలేంటో లోకేశ్ ఆత్మ విమర్శ చేసుకుంటున్నట్టుగా లేరని, ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు , అలాగే తనపై నమోదవుతున్న వరుస కేసులన్నీ రిట్నర్ గిఫ్ట్ లో భాగమే అనే విషయాన్ని లోకేశ్ గ్రహించాల్సి ఉంది. గతంలో జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపండంలో చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కాంగ్రేస్, టీడీపీ కలిసి 16 నెలల పాటు అక్రమంగా జైలులో పెట్టిన, నేడు చంద్రబాబు, లోకేశ్ మాదిరిగా జగన్ ఎప్పుడూ ఏడ్వలేదు, కుంగిపోలేదు. అంతేకాక లోకేశ్ మాదిరి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాలాంటి ప్రగల్భాలు పలకలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లోకేశ్ రాజకీయాల్లోకి రాకముందే జగన్ కు చంద్రబాబు చాలా గిఫ్ట్ లు ఇచ్చారని, ఇప్పుడు ప్రత్యేకంగా లోకేశ్ ఇచ్చేదేమి లేదని, టాక్ వినిపిస్తోంది.
గిఫ్ట్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం గౌరవమని, ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేశ్ కు కూడా జగన్ రిట్నర్ గిఫ్ట్ లు ఇస్తున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ కు తామేం చేశామనే సంగతుల్ని తండ్రీకొడుకులు విస్మరించి.. ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారని టాక్ వినిపిస్తోంది. లోకేష్ ఇచ్చే రిట్నర్ గిఫ్ట్ ఏమో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A 14 లోకేశ్ ను చేర్చి.. జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మరి.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ పేరు చేర్చడం జగన్ ఇచ్చిన రిట్నర్ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.