iDreamPost

జైల్లో దోమలు కుట్టక..రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?: కొడాలి నాని

జైల్లో దోమలు కుట్టక..రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?: కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఆ పార్టీ కేడర్ తీవ్ర నిరాశలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఉండే గదికి దోమలు పంపుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. జైల్లో ఉంటే దోమలు కుట్టక..రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా? అంటూ సెటైర్లు వేశారు.

మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా.. చంద్రబాబు, లోకేశ్ లపై సెటైర్లు వేశారు. కొడాలి నాని మాట్లాడుతూ.. లోకేశ్ మా పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాడని, తాము లోకేశ్ పేరును చిత్తు కాగితాల్లో కూడా రాయమని కొడాలి నాని సెటైర్లు వేశాడు.  ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని చెప్పిన లోకేశ్.. తన తండ్రి జైలుకెళ్తే.. ఎందుకు ఏడుస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా అంటూ చురకలంటించారు.  చంద్రబాబు అరెస్ట్ తో లోకేశ్ తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తున్నాడని విమర్శించారు. తన భర్తకు జైల్లో వసతుల్లేవు, వేడి నీళ్లు లేవని భువనేశ్వరి అంటున్నారు.

ఏసీలు, ఫ్రిజ్ లు, కూలర్లు ఉండటానికి అదేం ఇల్లు కాదని, జైల్లో  ఉంటే దోమలు కుట్టక..  రంభ, ఊర్వశి, మేనక కన్ను కొడతారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. జైల్లో ఏమైన వసతలు కావాలంటే కోర్టును అడగాలిని ఆయన హితవు పలికారు. చంద్రబాబు కోసం ఎవరు పాదయాత్రలు చేయట్లేదని ఆయన అన్నారు. చంద్రబాబు కోసం యాత్రలుచేసేది కమ్మ కులస్తులు మాత్రమేని, తమ వాళ్లకే కార్లు ఎక్కువగా ఉన్నాయని, పొరుగు దేశాల్లో, రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీలేమైనా నిరసనలు చేస్తున్నారా? అని కొడాలి నాని విమర్శించారు. మరి.. చంద్రబాబుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.