YS Jagan Mohan Reddy: జగన్ ప్లాన్-B స్టార్ట్! ప్రతిపక్షాలు తేరుకునేలోపే ముగించేస్తారా?

జగన్ ప్లాన్-B స్టార్ట్! ప్రతిపక్షాలు తేరుకునేలోపే ముగించేస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అందరి అంచనాలకు అందని విధంగా పరిపాలనలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా కేవలం పరిపాలన విషయంలోనే కాకుండా..పార్టీ వ్యవహారాల్లో సైతం విలక్షణమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయాలకు ప్రతిపక్షాలు సైతం బిత్తర పోవాల్సిన పరిస్థితి  ఉందనేది ఎవరు కాదనలేని సత్యం. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు అనేక షాకులు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. మరో గిప్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్లాన్ ఏ సక్సెస్  అయినా జగన్ మోహన్ రెడ్డి.. ప్రతిపక్షాలు తేరుకునే లోపే ప్లాన్ బి సిద్ధం చేశాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ ప్లాన్ సంగతి  ఏమిటో ఇప్పుడు తెలుసకుందాం..

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినది తొలి రోజు నుంచి ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగాంగానే అనేక సంక్షేమ పథకాలతో ప్రజల వద్దకు జగన్ పరోక్షంగా వెళ్లారు. అమ్మఒడి, పింఛన్ , రైతు భరోసా, నాడు-నేడు, ఆరోగ్య శ్రీ, జగనన్న సురక్ష, కాపు నేస్తం వంటి అనేక సంక్షేమ పథకాలతో నిత్యం ప్రజలను సీఎం జగన్ పలకరిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకున్నారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారులకు నష్టం జరగకూడదని జగన్ భావించారు.  అందుకే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలను ఇతర ప్రజా ప్రతినిధులను ప్రజల వద్దకు పంపారు.

ఇలా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రజల్లో ఉండటంలో జగన్ సక్సెస్ అయ్యారు. అలానే జగన్ ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిచాయి. ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక లా మారుతుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అయితే చివరకు తాము అధికారంలోకి వస్తే.. అలాంటి పథకాలే ప్రవేశ పెడతామని,  అంతేకాక అంతకు మించిన పథకాలను అందిస్తామని ప్రతిపక్ష పార్టీలు చెప్పాయి. అంటే.. ఎవరైతే జగన్ పథకాలను విమర్శించారో వారి చేతనే అవే పథకాలు అమలు చేస్తామనేలా జగన్ చేశారు. ఇదే ప్లాన్ ఏలో భాగంగా జగన్ సాధించిన సక్సెస్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక తాజాగా ప్లాన్ బికి సీఎం జగన్  సిద్ధమైనట్లు, అందులో భాగంగానే విజయవాడలో జరిగిన పార్టీ  కార్యక్రమంలో కీలక ప్రకటనలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సీఎం జగన్ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారని, ఇన్నాళ్లూ ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బస్సు యాత్రకు సిద్ధం కావాలంటూ శ్రేణులకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 31వరకు దాదాపు 2నెలలపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని చెప్పారు సీఎం జగన్.

ప్రతి రోజూ మూడు సమావేశాలు జరుగుతాయని, ప్రభుత్వం చేసిన మంచి, సామాజిక న్యాయం, సాధికారత గురించి ప్రజలకు వివరించి చెప్పాలని నేతలకు సూచించారు జగన్. ఇదే సమయంలో టీడీపీ, జనసేనలు కనీసం పొత్తులపై ఓ క్లారీటీకి రాలేదని, అంతేకాక వారు ప్రజల్లోకి వెళ్లే లోపు జగన్ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఇతర కార్యక్రమాలను పూర్తి చేస్తారని పొటికాల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు కలిసి అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలోకి దిగేలోపు.. జగన్  ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లి.. తాను అనుకున్న పని పూర్తి చేస్తారని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. మరి.. సీఎం జగన్  అమలు చేస్తున్న వ్యూహాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments