iDreamPost
android-app
ios-app

APలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తుంది: సీఎం జగన్!

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటనలో భాగంగా ఇండియా టూడే ఎడ్యూకేషన్ సమ్మిట్ 2024లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏపీలో చెత్త రాజకీయం చేస్తుందని మండపడ్డారు.

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటనలో భాగంగా ఇండియా టూడే ఎడ్యూకేషన్ సమ్మిట్ 2024లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏపీలో చెత్త రాజకీయం చేస్తుందని మండపడ్డారు.

APలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తుంది: సీఎం జగన్!

బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరుగుతోన్న ఇండియా టూడే ఎడ్యూకేషనల్ సమ్మిట్ 2024లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల గురించి సీఎం జగన్ వివరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తుందని, ఆ పార్టీ తమ కుటుంబాన్ని విడదీసేందుకు కుట్ర చేస్తోందని సీఎం జగన్ మండిపడ్డారు.

ఇటీవలే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను ఆ పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఇక బాధ్యతలు స్వీకరించిన అనంతరం షర్మిల..వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విమర్శలు చేశారు. ఈక్రమంలో మంగళవారం ఉరవకొండ సభలో పరోక్షంగా షర్మిల గురించి సీఎం జగన్ ప్రస్తావించారు.  తాజాగా తిరుపతిలో జరిగిన ఇండియా టూడే ఎడ్యూకేషన్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం జగన్.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఏపీలో చెత్త రాజకీయం చేస్తోందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని, తమ ప్రభుత్వావనికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇదేనని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనకున్నారని సీఎం ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కి డర్టీ గేమ్స్ ఆడటం అలవాటని సీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ  రాష్టాన్ని అన్యాయంగా విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని సీఎం జగన్  మండిపడ్డారు.

“కాంగ్రెస్ ఏపీలో చెత్త రాజకీయం చేస్తోంది. గతంలోనూ మా బాబాయ్ ను మంత్రిగా చేసి ..మాకు వ్యతిరేకంగా పోటీ చేయించారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్.. మరోసారి మా సోదరిని ప్రయోగించింది.  కాంగ్రెస్  మాకు కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం  చేస్తోంది. దేవుడు వీరికి గుణపాఠం చెబుతాడు” అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవని ఆయన అన్నారు. గత ప్రభుత్వం టైమ్ లో కూడా ఇదే బడ్జెట్ ఉంది.  కానీ అప్పుడు డీబీటీ ఎందుకు జరగలేదు.

మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదని, సీఐడీని దుర్వినియోగం ఆరోపణలు అర్ధరహితం అని తెలిపారు. చంద్రబాబుపై ఆరోపణలు,వాటిపై ఆధారాలు పరిశీలించాకే కోర్టులు నిర్ణయం తీసుకున్నాయని ఆయన తెలిపారు. ఇక ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఉనికి లేదని, వచ్చే ఎన్నికలలో పోటీ తమ పార్టీకీ టీడీపీ-జనసేన కూటమికేనని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము రాజీపడమని సీఎం జగన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.