Arjun Suravaram
Arjun Suravaram
స్కీల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందా? అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో చంద్రబాబుకు సంబంధించిన వివిధ పిటిషన్లు ఉన్నాయి. బుధవారం చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీం కోర్టుకు ముందుకు వచ్చింది. హైకోర్టులో చుక్కెదురు అయినట్లే.. సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. ఆయన క్వాష్ పిటిషన్ ను అకోబర్ 3కు వాయిదా వేసింది సీజేఐ. దీంతో అప్పటి వరకు చంద్రబాబు జైలు ఉండక తప్పదు. మరి.. అసలు సుప్రీం కోర్టు లో జరిగిన పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
గత శుక్రవారం ఏపీ హైకోర్టు చంద్రబాబు తరపు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వాయిదాలు పడుతూ.. బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. తొలుత చంద్రబాబు పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు జడ్జి.. జస్టిసీ ఎస్వీఎన్ భట్టి తిరష్కరించారు. దీంతో అదే బెంచ్ లో ఉన్న మరో న్యాయమూర్తి ఖన్నా కేసును వాయిదా వేశారు. ఈ ద్విసభ్య ధర్మాసనం నాట్ ఫర్ మీ అనడంతో చంద్రబాబు తరపు లాయర్లు సీజేఐ ను ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
ఇక చంద్రబాబు కేసును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందుకు లూథ్రా తీసుకెళ్లారు. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు విన్న సీజేఐ అక్టోబర్ 3 తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్బంగా సీజేఐ పలు కీలక విషయాలు వెల్లడించారు. చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండని, అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తామని సీజేఐ తెలిపారు. ఏసీబీ కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేమని, అక్టోబర్ 3న అన్ని విషయాలపై చర్చిద్దామాని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. మరి.. సుప్రీం కోర్టు చంద్రబాబు పిటిషన్ ను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.