బాబు మరో 3 నెలలు జైల్లోనే.. కారణాలు చెప్పిన జర్నలిస్ట్ సాయి!

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఉంది. ఇప్పటికే  ఈ కేసు సుప్రీం కోర్టు చాలా సార్లు వాయిదా వేసింది. ఇక సుప్రీం కోర్టులో జరుగుతున్న ఈ పరిణామాలపై  అందరిలో ఏ సందేహం వ్యక్తం అవుతుంది. చంద్రబాబు ఇప్పట్లో  బయటకి రాకపోవచ్చని, మరో మూడు నెలలు జైల్లోనే ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సాయి సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.  అందుకు గల కారణాలను సైతం ఆయన వెల్లడించారు.

జర్నలిస్ట్ సాయి మాట్లాడుతూ..”శుక్రవారం క్వాష్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరకు కేసును మంగళవారానికి వాయిదా వేసింది. ఈ క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో జరిగిన పరిణామాలను బట్టి.. చంద్రబాబు రిలీజ్ వెంటనే సాధ్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు పైబర్ గ్రిడ్ కుంభకోణం.  సోమవారం ఈ కేసు ఏసీబీ కోర్టులో ప్రవేశ పెడితే.. అక్కడ కేసును 15 రోజులు వాయిదా వేయోచ్చు. అక్కడ కూడా కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ వంటివి నడుస్తాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ ను 17 వరకు వాయిదా వేసింది.

అలానే అప్పటి  వరకు చంద్రబాబును అరెస్ట్ చేయోద్దని కోర్టు ఆదేశించింది. 17 ఏ సెక్షన్ వర్తిస్తుందా లేదా అనే దానిపై ఇప్పటికే సుప్రీం కోర్టులో ముకుల్ రోహిత్గి వాదించారు. ఆయన వాదనల్లో తప్పు ఉంటేనో, లేకుంటే చంద్రబాబును ఎక్కువ రోజులు అలా  ఉంచకూదని అనుకుంటే.. ఈ పాటికే విడుదల చేసేవారు. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైన తొలిరోజే విడుదల చేసేవారు. ఇన్నిసార్లు వాయిదా పడుతుందంటేనే.. 90 శాతం అందులో మీమామ్స్ ఉన్నట్లు పాయింట్ చెబుతున్నారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 17A ని కొట్టేసి.. తీర్పు ఇస్తే.. ఇదే బెంచ్ మార్క్ కేసు అవుతుంది. ఈ తీర్పుతో రేపటి రోజు ఏ రాజకీయ నాయకుడిని భారత దేశంలో అరెస్ట్  చేయడానికి వీలు కాదు. కేవలం కేంద్ర ప్రభుత్వ అండ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ప్రతిపక్షాల మీద చేయగలుగుతాయి.  అయితే ఇలాంటి చర్యలు కోర్టులకు ఇష్టం ఉండదు. అవినీతి అనేది సమాజాన్ని కలచివేస్తున్న ఓ పెద్ద దుర్మర్గమైన  వ్యవహారమని కోర్టులు బలంగా నమ్ముతున్నాయి.

అందుకే నాడు జగన్ మోహన్ రెడ్డి, చిదంబరం, కార్తీక్ చిదంబరం వంటి  ఎవరికీ కోర్టు ఊరట ఇవ్వలేదు. అలాంటిది బాబు కోసం ఇవ్వడం ప్రారంభిస్తే రేపటి నుంచి  అవినీతి కేసులో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు బయటకు వచ్చేస్తాడు. అవినీతి పరుడా కాదా? అనేది కోర్టు తేల్చాలి. కానీ ముందే అనుమతులు  ఇవ్వాలా వద్దా అనే సందేహంపైనే ఇన్ని రోజులు బాబు కేసు వాయిదా పడుతూ వస్తుంది. ఇక తరువాతి కేసులు కూడా అవినీతివే.. వీటిల్లో కూడా వదిలేయాలా? అంటూ సీఐడీ నుంచి ప్రశ్నలు రావచ్చు. ఈ పరిణామాలు అన్ని గమనిస్తే.. ఏదైన అనుకోని పరిస్థితుల్లో తప్ప మూడు నెలలు బాబు జైల్లోనే ఉంటారు” అని జర్నలిస్ట్ సాయి అన్నారు. మరి.. మరో 3 నెలలు బాబు జైల్లోనే అని జర్నలిస్ట్ సాయి చెప్పిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments