iDreamPost

అడిగిన వాటికి తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిందే: సజ్జల

అడిగిన వాటికి తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిందే: సజ్జల

ప్రస్తుతం ఏపీలో రాజకీయం చంద్రబాబు అరెస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే  చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. వారికి ధీటుగానే వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. వీరి మధ్యలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి.. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇలా తరచూ ప్రజా సమస్యలపై కాకుండా చంద్రబాబు సపోర్టుగా పుత్రుడి పాత్ర పోషిస్తున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు అడిగిన వాటికి చచ్చినట్లు సమాధానం ఇవ్వాల్సిందే అని ఆయన అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల  కాకినాడ జిల్లా సామర్ల కోటలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. అక్కడ జగనన్న కాలనీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.  అయితే సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి ధీటుగా వైసీపీ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు. ఇక శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్, ఆరోగ్యం అంశాల గురించి ప్రస్తావించారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు ఆడుతున్నరని, చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని తప్పు ప్రచారం చేస్తున్నారంటూ సజ్జల మండిపడ్డారు.

ఇదే సమయంలో పవన్ కల్యాణ్ గురించి కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ పెళ్లిళ్ల గురించి సీఎం జగన్ చెప్పిన దాంట్లో ఒక్క చిన్న అబద్ధమైన ఉందా అని సజ్జల  ప్రశ్నించారు. ఒకసారి ప్రజాజీవితంలోకి వచ్చాక ఎవరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. విడాకులు తప్పేం కాదు.  అయితే అవి వరుసగా మూడు జరగడంతో లోపం వాళ్లలోనా.. నీలోనా? అని సమాజంలో చర్చ వస్తుంది. ఇవన్నీ వదిలేసి నువ్వు సందేశాలు ఇస్తే ఎలా? అడిగిన వాటికి చచ్చినట్లు జవాబివ్వాల్సిందే అని తెలిపారు. మరి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి