Arjun Suravaram
Pawan Kalyan: బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ ప్రవర్తించిన తీరుపై ఆ నియోజవర్గ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పొత్తు ధర్మంతో తాము వస్తే.. అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan: బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ ప్రవర్తించిన తీరుపై ఆ నియోజవర్గ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పొత్తు ధర్మంతో తాము వస్తే.. అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Arjun Suravaram
ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైన సీఎం జగన్ మోహన్ రెడ్డి గెలుపు అడ్డుకోవాలని టీడీపీ, జనసేనాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగుతున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్నా.. ఇప్పటికి వరకు ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంపై స్పష్టత రాలేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి సీట్ల విషయంపై స్పష్టంగా చర్చించుకున్న సందర్భాలు లేవని టాక్. ఇలానే క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మరోవైపు ఇరు పార్టీల అధినేతలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అలానే భీమవరంలో పవన్ కల్యాణ్ సభ నిర్వహించారు. అయితే ఇక్కడ ఆయన ప్రవర్తించిన తీరుపై టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.
బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి పర్యటనలో భాగంగా భీమవరం వెళ్లారు. అక్కడ ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట రామలక్ష్మి నివాసంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం ఓ ఫక్షన్ హాల్ పవన్ కల్యాణ్ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ, జనసేన కార్యకర్తలు వచ్చారు. ముఖ్యంగా టీడీపీకి చెందిన పలువురు నేతల పవన్ కల్యాణ్ ను మర్యాద పూర్వకంగా పలకరించాలనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన కోసం గంటల తరబడి ఫంక్షన్ హాల్ లో, బయట ప్రాంగణంలో ఎండలో నిల్చున్నారు.
అయితే సభకు వచ్చిన పవన్ కల్యాణ్ .. టీడీపీ నేతలను, కార్యకర్తలను కలవకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన కోసం గంటల తరబడి ఎదురు చూసిన టీడీపీ కార్యకర్తలు.. పవన్ కల్యాణ్ కలవకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ తీరుతో టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా తాము వచ్చామని, మరి.. ఆయన కోసం తాము గంటల తరబడి ఇక్కడ ఉంటే.. పట్టించుకోకుండా పోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలవలేకపోయినా.. కనీసం వచ్చి జనంకి కనిపించి చేయి ఊపి వెళ్లిన అందరం సంతోషించే వాళ్లం కదా అంటూ ప్రశ్నించారు.
ఆయన కోసం ఎంతో మంది జనం వచ్చారని, ఇలా పలకరించకుండా పోవడం మంచి కాదు కదా?, ఇలా అయితే ఆయన రాజకీయం చాలా ఇబ్బందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా భాగస్వామి పార్టీ కార్యకర్తలను కలుపుకోకుండా ఆయన పోటీ చేసి ఏం గెలుస్తారంటూ సెటైర్లు వేశారు. ఆయన వారం క్రితం నుంచే ఆయన వస్తారు అని చెప్పడంతో ఎదురు చూస్తాన్నామని, తీరా పవన్ వచ్చిన తరువాత అందరిని నిరుత్సాహానికి గురి చేస్తూ వెళ్లిపోయారని అక్కడి టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. మొత్తంగా భీమవరం టీడీపీ కార్యకర్తలు పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.