California: అమెరికాలో తొలి జడ్జిగా..తెలుగు మహిళకు అరుదైన గౌరవం!

California: అమెరికాలో తొలి జడ్జిగా..తెలుగు మహిళకు అరుదైన గౌరవం!

తెలుగు వారు అనేక దేశాలకు వెళ్లి..స్థిరపడిపోయారు. తమదైన ప్రతిభతో పలు దేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే ఎందరో తెలుగు వారు అరుదైన గౌరవాలను పొందుతున్నారు. తాజాగా ఓ తెలుగు మహిళ అరుదైన ఘనత సాధించింది.

తెలుగు వారు అనేక దేశాలకు వెళ్లి..స్థిరపడిపోయారు. తమదైన ప్రతిభతో పలు దేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే ఎందరో తెలుగు వారు అరుదైన గౌరవాలను పొందుతున్నారు. తాజాగా ఓ తెలుగు మహిళ అరుదైన ఘనత సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తెలుగు స్థిరపడ్డారు. అంతేకాక ఎంతో మంది తమదైన ప్రతిభతో తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఎంతో మంది వివిధ పనుల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి.. అక్కడ అన్ని రంగాల్లో తమదైన ప్రతిభను చూపిస్తున్నారు. భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్లు విదేశాల్లోని రాజకీయాల్లో, వ్యాపారాల్లో తమ మార్క్ ను చూపిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ వాసి..బ్రిటన్ లోని ఓ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధాన పార్టీ తరపున  పోటీ చేస్తున్నారు. తాజాగా మరో తెలుగు మహిళ అరుదైన గౌరవం పొందింది. ఆమెకు దక్కిన గౌరవంతో తెలుగు ప్రతిష్ట మరో మెట్టు పైకి ఎక్కింది. మరి.. అసలు ఆ మహిళ ఎవరు.. ఆమె సాధించిన ఆ అరుదైన ఘనత ఏమిటో ఇప్పుడు చూద్దాం…

అమెరికా ఖండంలోని ఓ రాష్ట్రానికి చెందిన కోర్టులో జడ్జిగా భారతీయ మహిళ నియమించబడ్డారు. భారతీయురాలు, అందులోనూ తెలుగు మహిళ కావడం విశేషం. ఆమెను కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టుకు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వూలు వెలువడ్డాయి. శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా బాడిగ జయ బాడిగ నియమించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రాంతానికి చెందిన మహిళ. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా బాడిగ జయ గుర్తింపు పొందారు.

ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, ప్రేమలత దంపతుల కుమార్తె బాడిగ జయ. ఈమె హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో బీఏ పూర్తి చేశారు. 1991-1994 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, పొలిటికల్‌ సైన్సు సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లి.. అక్కడ బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్య అభ్యసించారు. అనంతరం ఆమె అక్కడే లా విద్యను అభ్యసించారు. 2022 నుంచి కోర్టు కమిషనర్‌గా బాడిగ జయ పని చేశారు. ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలో కుటుంబ న్యాయ సలహాల రంగంలో నిపుణురాలిగా గుర్తింపు పొందారు.

కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ అటార్నీగా, గవర్నర్‌ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలో కూడా ఆమె పని చేశారు. అమెరికాలో తెలుగు మహిళ జడ్జి కావడంతో ఆమె బంధువులు, సొంత గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జడ్జి పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించారు. జయతోపాటు మరో భారత సంతతికి చెందిన న్యాయమూర్తి రాజ్‌ సింగ్‌ బధేషా సహా 18 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తూ గవర్నర్‌ న్యూసోమ్‌ సోమవారం ఉత్తర్వూలు జారీ చేశారు.

Show comments