చిరంజీవి.. ముందుగా పవన్ కు సలహాలివ్వాలి: మంత్రి రోజా

చిరంజీవి.. ముందుగా పవన్ కు సలహాలివ్వాలి: మంత్రి రోజా

ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడీవేడీగా నడుస్తుంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష జనసేన మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవలే బ్రో సినిమాపై చాలా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.  తాజాగా మరో వివాదంతో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా ఉన్నాయి. రెండు రోజుల క్రితం ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల సక్సెస్ మీట్ లో  మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ప్రభుత్వాలకు సలహా ఇచ్చే ముందు..తన తమ్ముడికి ఇవ్వాలంటూ ఫైరవుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, మాజీ మంత్రులు స్పందించగా.. తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా కూడా చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

తిరుపతి జిల్లా వడమాల పేటలో “మా భూమి నాదేశం తల్లికి నమస్కారం” కార్యక్రమాన్ని టీసీఆగ్రహంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా.. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకూదని మంత్రి రోజా హితవు పలికారు. చిరంజీవి సలహా ఇవ్వాలనుకుంటే.. ఆయన తమ్ముడికి ఇవ్వాలని సూచించారు.  చిరంజీవి కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏమీ చేశారని ప్రశ్నించారు. సినిమా వాళ్లు చేప్తే వినే స్థాయిలో తాములేమని ఆమె తెలిపారు.

“ఏ ఉద్దేశంతో, ఏ సందర్భంలో చిరంజీవి గారు మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ.. సీఎం జగన్ గానీ, మేము కానీ సినిమాల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎప్పుడూ చూసిన పవన్ కల్యాణే.. నాకు రెండు కోట్లు ఇస్తారు, ఐదు కోట్లు, 30 కోట్లు ఇస్తారని చెప్పుకున్నాడు. అంతే తప్ప  ఏపీ ప్రభుత్వంలోని వారు ఎవరు మాట్లాడలేదు. నేను కూడా ఆర్టిస్ట్ నే. సినిమాలు చేసేటప్పుడు సినిమాల గురించి మాట్లాడాలి, రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలి. అంతే కానీ సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడటం సరైనది కాదు. అలా సినిమా వేదికలపై ఏపీ ప్రభుత్వాన్ని,సీఎం జగన్ పై కావాల్సి దుమ్మెత్తి పోసేది పవన్ కల్యాణ్.

చిరంజీవి గారు సలహాలు ఇవ్వాలనుకుంటే.. ముందుగా పవన్ కల్యాణ్ కి ఇవ్వాలి. పవన్ కల్యాణ్ తప్ప.. ఏ హీరో కూడా సినిమా  కార్యక్రమాల్లో రాజకీయం గురించి మాట్లాడరు. గడప గడపకు వచ్చి చూస్తే  ఎన్ని రోడ్లు వేశామోననేది తెలుస్తుంది. ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధర పెంచమని అడిగారు. హీరోలందరూ  సీఎం జగన్ దగ్గరకు ఎందుకెళ్లారు. రాష్ట్ర  విడిపోతే చిరంజీవి ఏం చేశారని, హోదా గురించి అప్పుడెందుకు అడగలేదు” అని మంత్రి రోజా ప్రశ్నించారు. మరి.. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రతి ఒక్కరి చేతిలో చదువు అనే బ్రహ్మాస్త్రం ఉండాలి: సీఎం జగన్

Show comments