Arjun Suravaram
Arjun Suravaram
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత ఏపీ రాజకీయం చాలా విచిత్రంగా మారింది. ముఖ్యంగా వివిధ కేసుల్లో టీడీపీ అధినేత నుంచి మొదలు పలువురు కీలక నేతలు చిక్కుకున్నారు. అంతేకాక ముందస్తు బెయిల్ వంటి పిటిషన్లు వేస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ మంత్రి పి.నారాయణ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కేసులో పలు పిటిషన్లు కోర్టులో వేశారు. తాజాగా నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఐఆర్ఆర్ కేసులో నారాయణ అల్లుడు పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఇచ్చిన నోటీసులను డిస్మిస్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు.
సీఐడీ నోటీస్ క్వాష్ చేయాలన్న పునీత్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అంతేకాక న్యాయవాదితో కలిసి రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలని పునీత్ ను హైకోర్టు ఆదేశించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు! తమకేం తెలియదంటూ చంద్రబాబు, నారాయణ, లోకేశ్ బృందం ఎంత బుకాయిస్తున్నా అక్రమాలు మాత్రం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ లబ్ధికి చంద్రబాబు, నారాయణ పక్కా ప్రణాళిక రచించారని సీఐడీ ఆరోపిస్తుంది. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేసినట్లు సీఐడీ తెలిపింది. మరి.. నారాయణ అల్లుడు పునీత్ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.