iDreamPost
android-app
ios-app

జనసేనలో గ్రూప్‌ రాజకీయాలు.. TDP సమక్షంలో కొట్లాట!

ఏపీలో జనసేన, టీడీపీ నియోజవర్గ స్థాయి సమన్వయ భేటీలు ప్రారంభమయ్యాయి. అయితే పలు చోట్ల ఈ భేటీలు రసాభాసంగా మారుతున్నాయి. నిన్న పిఠాపురం, నేడు అనకపల్లిలో ఈ భేటీల్లో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.

ఏపీలో జనసేన, టీడీపీ నియోజవర్గ స్థాయి సమన్వయ భేటీలు ప్రారంభమయ్యాయి. అయితే పలు చోట్ల ఈ భేటీలు రసాభాసంగా మారుతున్నాయి. నిన్న పిఠాపురం, నేడు అనకపల్లిలో ఈ భేటీల్లో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.

జనసేనలో గ్రూప్‌ రాజకీయాలు.. TDP సమక్షంలో కొట్లాట!

ఆంధ్రప్రదేశ్ లో  జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసింది. అంతేకాక ఉమ్మడి కార్యాచరణ కోసం ప్రత్యేక సమావేశాలు సైతం నిర్వహించాయి. ఈ క్రమంలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. అలానే మంగళవారం 11 అంశాలతో మిని మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే నియోజకవర్గ స్థాయి సమావేశాల సందర్భంగా జనసేనలో గ్రూపు రాజకీయాలు బయట పడుతున్నాయి. బుధవారం అనకాపల్లిలో టీడీపీతో జరిగిన సమన్వయ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల సమక్షంలో జన కార్యకర్తలు ఘర్షణ పడ్డారు.

ఇటీవలే టీడీపీ, జనసేన నియోజకవర్గ స్థాయిలో సమన్వయ భేటీ జరగాలని.. ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయించాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఉప్పల చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో టీడీపీ, జనసేన సమన్వయ భేటీ జరిగింది. ఆ సమయంలో జనసేన లోని ఇద్దరు నేతల మధ్య ఘర్షణ  చోటుచేసుకుంది. జనసేన నేతలు దూలం గోపి, పరచూరి భాస్కరరావు వర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరింది. వారి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. చిలికి చిలికి గాలివానల మారి.. చివరకు పెద్దదిగా మారింది.

ఆ తర్వాత కాసేపటికి ఒక్కసారిగా తోపులాట జరిగింది. జనసేన తరపున మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పరచూరి భాస్కరరావు వర్గంపై దూలం గోపి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటకు మాట పెరిగి.. చివరకు గొడవలకు దారి తీసింది. ఇక జనసైనికులను నిలువరించేందుకు టీడీపీ నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మొదటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని టాక్. ఆ విషయం తెలిసి కూడా టీడీపీ నేతలు విడివిడిగా వాళ్లకు ఆహ్వానం అందించినట్లు సమాచారం.

అయితే ఇందంతా టీడీపీ తో పెట్టుకున్న పొత్తు మహిమా అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి పర్యటించిన సమయంలో ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో పవన్ పర్యటనకు  వెళ్లినప్పుడు కూడా ఈ రెండు వర్గాలు పరస్పరం దాడులు  చేసుకున్నాయి. ఆ సమయంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అప్పుడు పెద్ద గొడవే జరిగింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌ రాజకీయాలకు జనసేనాని పుల్‌స్టాప్‌ పెట్టకపోవడం, అవి ఇప్పుడు తమతో జరుగుతున్న సమావేశాల్లోనే రచ్చకు దారితీయడంతో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవలే పిఠాపురంలో అయితే టీడీపీ, జనసేన నేతల  మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ప్రారంభంలోనే ఇలా ఉంటే.. ఇక ఎన్నికల సమయానికి వీళ్ల పొత్తుకు ఎన్ని గొడవలు జరుగుతాయో అని పొలిటికల్ సర్కిల్ చర్చించుకుంటున్నారు. జనసేన, టీడీపీ సమావేశాల్లో జరిగే గొడవలు కేవలం ట్రైలరే అని.. అసలు సినిమా ముందుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. జనసేన నేతల రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.