శ్రీశైలంలో అపచారం.. మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి!

Srisailam: ఏపీలో అనేక ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో శైవ క్షేత్రమైన శ్రీశైలం ఒకటి. మల్లన్నను దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి మహా పుణ్యక్షేత్రంలో గురువారం అపచారం జరిగింది.

Srisailam: ఏపీలో అనేక ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో శైవ క్షేత్రమైన శ్రీశైలం ఒకటి. మల్లన్నను దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి మహా పుణ్యక్షేత్రంలో గురువారం అపచారం జరిగింది.

దేశంలో అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిని హిందూవులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి దేవస్థానాలు, పూజల వద్ద ఎవరైనా మద్యం తాగడం, సిగరెట్ తాగడం, ఇతర అపవిత్ర కార్యక్రమాలు చేస్తే.. భక్తులు అపచారంగా  భావిస్తారు. అందుకే ఆధ్యాత్మిక క్షేత్రాలు, దేవస్థానాల్లో దర్శనం చేసుకునే భక్తులకు కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేశారు. ఆరూల్స్ ను ఎవరైనా అతిక్రమిస్తే అపచారంగా భావిస్తారు. అంతేకాక అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. తాజాగా ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలోని ఆలయంలో అపచారం జరిగింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే…

చాలా అరుదుగా కొందరు పుణ్యక్షేత్రాల్లో చెత్తపనులు చేస్తుంటారు. పుణ్య క్షేత్రంలో కూడా చెయ్యకూడని పనులు చేస్తూ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను మంట కలుపుతున్నారు. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో అపచారం జరిగింది. మందు, మాంసాహారం నిషేధం అని తెలిసినా కూడా మల్లికార్జుస్వామి ఆలయంలో మందు తాగి ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు.  గురువారం రాత్రి 9 గంటలకు మల్లన్న దర్శనం కోసం భక్తులు క్యూ కంపార్ట్మెంట్ లో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఉద్యోగి ముఖభావాలు, తీరు తేడాగా ఉండటంతో భక్తులకు అనుమానం వచ్చింది. ఆ తరువాత అతడి దగ్గరికి వెళ్లి పరిశీలించగా మద్యం సేవించినట్లు గుర్తించారు. వెంటనే అతడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం కొంంతమంది భక్తులు ఆలయ క్యూ లైన్ల దగ్గర బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇక విషయం తెలుసుకున్న ఆలయ అధికారి స్వాములు అక్కడికి చేరుకున్నారు. భక్తులకు సర్థి చెప్పే ప్రయత్నం చేయగా..ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటే  ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. శ్రీశైలం మల్లన్న ఆలయ పవిత్రతను కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిపై శుక్రవారం ఉదయం ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో తెలిపారు. గతంలో కూడా వివిధ పుణ్యక్షేత్రాల్లో కొందరు అపవిత్ర కార్యక్రమాలు చేశారు. ఇలాంటి ఘటనలను జరగకుండా ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా ఎక్కడో ఒక్క చోట కొందరు ఇలాంటి పనులు చేస్తూ.. ఆలయంలో అపచారం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మరి.. శ్రీశైలం ఆలయంలో జరిగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments