iDreamPost

‘తంగలాన్’ చిన్న సినిమా కాదు.. తమిళులు ఇలా చేస్తున్నారేంటి?

  • Author ajaykrishna Published - 08:00 PM, Sat - 28 October 23

తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో అక్కడితో పాటు ఏకకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతుంటాయి. ఇది కొత్తగా మొదలైన తంతు కాదు. ఇదివరకు తమిళంలో సినిమాలకు టైటిల్స్ ఎలా ఉన్నా.. తెలుగులో మాత్రం ఇక్కడి ఆడియన్స్ కి అర్థమయ్యేలా పెట్టేవారు. ఈ మధ్యకాలంలో సినిమా తెలుగు రిలీజ్ అనుకున్నప్పుడు తెలుగు టైటిల్ పెట్టడానికి తమిళులకు ఏమైంది?

తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో అక్కడితో పాటు ఏకకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతుంటాయి. ఇది కొత్తగా మొదలైన తంతు కాదు. ఇదివరకు తమిళంలో సినిమాలకు టైటిల్స్ ఎలా ఉన్నా.. తెలుగులో మాత్రం ఇక్కడి ఆడియన్స్ కి అర్థమయ్యేలా పెట్టేవారు. ఈ మధ్యకాలంలో సినిమా తెలుగు రిలీజ్ అనుకున్నప్పుడు తెలుగు టైటిల్ పెట్టడానికి తమిళులకు ఏమైంది?

  • Author ajaykrishna Published - 08:00 PM, Sat - 28 October 23
‘తంగలాన్’ చిన్న సినిమా కాదు.. తమిళులు ఇలా చేస్తున్నారేంటి?

ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి డబ్ అవుతుంటాయి. మంచి పేరు, ఫేమ్ ఉన్న హీరోల సినిమాలు.. వేరే భాషలలోకి డబ్ చేసి, థియేట్రికల్ రిలీజ్ తో చేస్తుంటారు. అలా తెలుగులోకి డబ్ అయి రిలీజ్ అయ్యే సినిమాలు చాలామంది స్టార్స్ వి ఉన్నాయి. ముఖ్యంగా తమిళ హీరోల సినిమాలు తెలుగులో అక్కడితో పాటు ఏకకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతుంటాయి. ఇది కొత్తగా మొదలైన తంతు కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా జరుగుతుంది. కాకపోతే.. ఇదివరకు తమిళంలో ఒక టైటిల్ ఉంటే.. తెలుగులోకి వచ్చేసరికి టైటిల్స్ మారిపోయి జనాలకు అర్థమయ్యేలా ఉండేవి. అలా చాలామంది డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు.

అలా తెలుగులో డబ్బింగ్ సినిమాలతో స్టార్ అయిన హీరో విక్రమ్. విక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన శివపుత్రుడు(పితామగన్) సినిమా నుండి విక్రమ్ వరుసగా సినిమాలు డబ్ చేసి తెలుగు రిలీజ్ చేస్తున్నాడు. విక్రమ్ అనే కాదు.. సూర్య, అజిత్, దళపతి విజయ్, కార్తీ, రజినీకాంత్, ధనుష్, జయం రవి, శివ కార్తికేయన్, శింబు.. ఇలా దాదాపు తమిళ హీరోలంతా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అందుకు ప్రధాన కారణం.. వారి సినిమాలకు టైటిల్స్ తమిళంలో ఎలా ఉన్నా.. తెలుగులో మాత్రం ఇక్కడి ఆడియన్స్ కి అర్థమయ్యేలా పెట్టేవారు. సాంగ్స్, డైలాగ్స్ విషయంలోను చాలా కేర్ తీసుకునేవారు.

ఒకరకంగా డబ్బింగ్ సినిమా అనే ఫీల్ రాకుండా ఇక్కడి రైటర్స్ తో వర్క్ చేయించుకొని.. మంచి అవుట్ ఫుట్ తెచ్చుకునేవారు. కానీ.. కాలంలో మార్పులతో పాటు తమిళ మేకర్స్ లో బద్ధకం కూడా వచ్చేసింది. ఈ మధ్యకాలంలో అసలు తమిళ సినిమాల టైటిల్స్ ని అలాగే పెట్టి.. తెలుగు రిలీజ్ చేస్తున్నారు. అవేమో తమిళ పేర్లు.. తెలుగులో వాటి అర్థాలు తెలియక ఆడియన్స్ సినిమాకు వెళ్లాలా వద్దా అనే సంధిగ్ధంలో పడిపోతున్నారు. ఆ మధ్య అజిత్ వలిమై, ప్రభుదేవా ఉల్ఫ్.. రీసెంట్ గా శివకార్తికేయన్ అయలాన్, ఇప్పుడు తాజాగా విక్రమ్ తంగలాన్. అసలు వీటి అర్థాలు ఏంటో తెలుగు వాళ్లకు తెలియదు. పాన్ ఇండియా రిలీజ్ అని అనౌన్స్ చేసేశారు.

విక్రమ్ నటిస్తున్న తంగలాన్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. విక్రమ్ కి ఆల్రెడీ తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన చేసే ప్రతీ సినిమా తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. ప్రతీ సినిమాని తెలుగులో కూడా దగ్గరుండి ప్రమోట్ చేస్తుంటాడు విక్రమ్. అలాంటిది ఇప్పుడు తంగలాన్ అని భారీ మూవీ.. అందులోనూ పా. రంజిత్ డైరెక్టర్. ఈ కాంబినేషన్ గురించి వినగానే అందరిలో మినిమమ్ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. అదిగాక ఫస్ట్ లుక్, టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఈసారి విక్రమ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు అని అర్థమైంది.

సినిమాకు తమిళ పేరు పెట్టినప్పుడు.. తెలుగులో రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు.. టైటిల్ అయినా తెలుగులో పదాలతో పెడితే బాగుంటుంది కదా.. కనీసం కొంతమందికైనా సినిమా పేరు నోటబడుతుంది. తెలుగు రిలీజ్ అనుకున్నప్పుడు తెలుగు టైటిల్ పెట్టడానికి తమిళులకు ఏమైంది? ఎన్నిసార్లు చెప్పినా వీరి తీరు మారదా? అని తెలుగు ఆడియన్స్ వాదన. మరి రిలీజ్ టైమ్ కి అయినా మేకర్స్ తంగలాన్ టైటిల్ మార్చుతారేమో చూడాలి. తంగలాన్ టైటిల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి