iDreamPost

Shashank Singh: SRH రుణం తీర్చుకున్న శశాంక్.. ఇదే ఆరెంజ్ ఆర్మీ అభిమానులు కోరుకుంది!

  • Published Apr 27, 2024 | 1:29 PMUpdated Apr 27, 2024 | 1:29 PM

ఐపీఎల్ నయా హీరో శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్​కు మరో విజయాన్ని అందించాడు. గెలుపు అసాధ్యం అనుకున్న మ్యాచ్​లో కేకేఆర్ బౌలింగ్​ను చిత్తు చేసి తన టీమ్​కు మరో విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్ ద్వారా సన్​రైజర్స్ హైదరాబాద్ రుణాన్ని తీర్చుకున్నాడతను.

ఐపీఎల్ నయా హీరో శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్​కు మరో విజయాన్ని అందించాడు. గెలుపు అసాధ్యం అనుకున్న మ్యాచ్​లో కేకేఆర్ బౌలింగ్​ను చిత్తు చేసి తన టీమ్​కు మరో విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్ ద్వారా సన్​రైజర్స్ హైదరాబాద్ రుణాన్ని తీర్చుకున్నాడతను.

  • Published Apr 27, 2024 | 1:29 PMUpdated Apr 27, 2024 | 1:29 PM
Shashank Singh: SRH రుణం తీర్చుకున్న శశాంక్.. ఇదే ఆరెంజ్ ఆర్మీ అభిమానులు కోరుకుంది!

డొమెస్టిక్ క్రికెట్​లో అదరగొట్టి ఐపీఎల్ ఛాన్స్ దక్కించుకున్నాడతను. క్యాష్ రిచ్ లీగ్​లో రాణించి భారత జట్టులోకి అడుగు పెట్టాలని ఎన్నో కలలు కన్నాడు. అందుకోసం ఎంతో కఠోరంగా శ్రమించాడు. కానీ తీవ్రమైన పోటీ ఉండే ఐపీఎల్​లో అతడికి సరైన అవకాశాలు దక్కలేదు. అరకొర ఛాన్సులు వచ్చినా ఒత్తిడి వల్ల అతడు సత్తా చాటలేదు. అలా ఏళ్లు గడిచిపోయాయి. అయితే నిరుడు మినీ ఆక్షన్​లో పంజాబ్ కింగ్స్ అనుకోకుండా ఇంకొకరి ప్లేస్​లో అతడ్ని తీసుకుంది. ఆ ప్లేయరే ఇప్పుడు ఆ టీమ్​కు హీరో అయ్యాడు. వరుసగా విధ్వంసక ఇన్నింగ్స్​లతో పంజాబ్​కు విజయాలు అందిస్తున్నాడు. అతడే శశాంక్ సింగ్. ఐపీఎల్-2024లో ఈ బ్యాటర్​ హవా నడుస్తోంది. నిన్న కోల్​కతా నైట్ రైడర్స్ మీద కూడా 28 బంతుల్లోనే 68 పరుగులతో పంజాబ్​కు సంచలన విజయాన్ని అందించాడు.

కేకేఆర్ మీద పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ సాధించిందంటే అందుకు శశాంక్ ఆడిన తుఫాన్ ఇన్నింగ్సే కారణం. తీవ్ర ఒత్తిడిలోనూ కూల్​గా తన పని తాను చేసుకుపోయాడతను. ఎడాపెడా భారీ షాట్లు బాది సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్​ను పంజాబ్ వైపు తిప్పాడు. అయితే ఈ మ్యాచ్​తో అతడు సన్​రైజర్స్ హైదరాబాద్ రుణాన్ని కూడా తీర్చుకున్నాడు. ఎస్​ఆర్​హెచ్​కు శశాంక్​కు మధ్య కనెక్షన్ ఏంటనేగా మీ డౌట్. ఐపీఎల్-2022లో సన్​రైజర్స్​ జట్టుతో ట్రావెల్ అయ్యాడు శశాంక్. బ్యాట్​తో అంతగా ప్రభావం చూపించలేదు. కానీ టీమ్​తో ఉంటూ బ్యాటింగ్ మెళకువల్ని మెరుగుపర్చుకున్నాడు. ఇప్పుడు పంజాబ్ తరఫున అదరగొడుగుతున్నాడు. నిన్న మ్యాచ్​లో కోల్​కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రానా బౌలింగ్​ను ఊచకోత కోశాడు శశాంక్ సింగ్.

హర్షిత్ రానా వేసిన 18వ ఓవర్​లో ఏకంగా 25 వచ్చాయి. ఇందులో 17 పరుగులు శశాంక్ బాదగా.. మిగతావి బెయిర్​స్టో బ్యాట్ నుంచి వచ్చాయి. ఈ ఇన్నింగ్స్​తో ఎస్ఆర్​హెచ్ రుణాన్ని తీర్చుకున్నాడు శశాంక్. ఈ సీజన్​ ఫస్ట్ మ్యాచ్​లో కేకేఆర్​తో తలపడింది సన్​రైజర్స్. ఆ మ్యాచ్​లో 4 రన్స్ తేడాతో ఓడింది కమిన్స్ సేన. అందులో మయాంక్ వికెట్ తీసి హర్షిత్ ఓవరాక్షన్ చేశాడు. ఆ మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్లతో ప్రవర్తించిన తీరుపై అప్పట్లో అతడు ట్రోలింగ్​కు కూడా గురయ్యాడు. అయితే టోర్నీ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వస్తున్న హర్షిత్​ను నిన్న శశాంక్ బాదేశాడు. వరుస సిక్సులు, ఫోర్లతో అతడ్ని బెంబేలెత్తించాడు. నిన్న 4 ఓవర్లు వేసిన హర్షిత్ ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు. ఎస్​ఆర్​హెచ్​పై బిల్డప్ ఇచ్చిన అతడి పొగరును నిన్న శశాంక్ అణచాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ తాము కోరుకున్నది ఇదేనంటూ పంజాబ్ బ్యాటర్​ను మెచ్చుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Thatscalled Entertainment (@thatscalledentertainment)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి