వెంకీమామ జాతకం బాలేదు వెంకీమామలో సరదా తక్కువ, సోది ఎక్కువ. సింపుల్‌గా చెప్పాలంటే పాతకథనే , పాత సీన్లతో చుట్టేశారు. మేనమామ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనే భరోసాతో కథలో విషయం లేకుండా రెండున్నర గంటలు సినిమా చూపించారు. కథల విషయంలో జాగ్రత్తగా ఉంటాడనే సురేష్‌బాబుకి ఈ కథలో ఏం కొత్తదనం కనిపించిందో మరి! మురారి సినిమాలో మహేష్‌బాబుకి మేనమామ అనే లగేజ్‌ని తగిలిస్తే వెంకీమామ అవుతాడు. రోజా సినిమా మామా అల్లుళ్ల మధ్య జరిగితే కూడా ఇదే. […]