సంక్రాంతి పండుగ తెలుగునాట సినిమాలకు వసూళ్ల వర్షం కురిపించే పండుగ. అందుకే సంక్రాంతికి సినిమాలు విడుదల చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ఈ సంక్రాంతికి స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి చెప్పుకోదగ్గ ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో ఒక్కటి కూడా హిట్ టాక్ తెచ్చుకోకపోవడం గమనార్హం. ముందుగా జనవరి 11న తమిళ్ మూవీ తునివు తెలుగులో తెగింపు పేరుతో విడుదలైంది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో మనీ హైస్ట్ వెబ్ సిరీస్ ఛాయలు ఉన్నాయి […]
మెగాస్టార్ వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు గ్యారెంటీ. ఈసారి సంక్రాంతికి సినిమా లాక్ అయ్యింది. ఆర్నెలలు ముందుగానే సంక్రాతికి డేట్ ఫిక్స్ చేశారు చిరంజీవి. బాబీ డైరెక్షన్ తయావుతున్న సినిమాను , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా “కలుద్దాం సంక్రాంతికి” అనే క్యాప్షన్ తో, జనవరి 2023 అనే ట్యాగ్ లైన్ తో నిర్మాతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో శృతిహసన్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ […]
ఇక్కడ టఫ్ అంటే సినిమాల మధ్య పోటీ గురించి అనుకునేరు. కాదండి. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అలుముకున్న పరిస్థితుల గురించి. తీవ్ర ప్రభావం లేదనుకుంటూనే ఒమిక్రాన్ పడగ మెల్లగా కమ్ముకుంటోంది. ఏపిలో నైట్ కర్ఫ్యూలతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ రాబోతున్నాయన్న వార్తలు డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కేసుల పెరుగుదల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పండగ సీజన్ నే నమ్ముకుని వస్తున్న సినిమాలకు ఇదో సవాల్ లాంటిదే. పైగా టికెట్ పెంపుదల, అదనపు షోలు […]
సంక్రాంతి వచ్చేస్తోంది. సినిమా సంబరాలకు మూవీ లవర్స్ రెడీ అవుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఉండే ఉత్సాహం మాత్రం ఈసారి అంత స్థాయిలో లేదు. కారణం ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల వాయిదానే. నాగార్జున బంగార్రాజు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదన్న మాట వాస్తవం. ఇక 14న ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడుతున్నా కూడా కిక్ మాత్రం తక్కువే అనే చెప్పాలి. నాగార్జున రేస్ లో ఉన్నా కూడా మరికొన్ని మీడియం బడ్జెట్ మూవీస్ […]
ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి అయితే అతివృష్టి లేదా అనావృష్టిలా ఉంది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడిపోయింది. రాధే శ్యామ్ రావడం మీద అనుమానాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చిన్న ప్లస్ మీడియం బడ్జెట్ సినిమాలు పోటీ పడి మరీ డేట్లను ప్రకటించడం డిస్ట్రిబ్యూటర్లను నివ్వెరపరుస్తోంది. వీళ్లకు కనీస సమాచారం లేకుండా కొన్ని అనౌన్స్ మెంట్లు ఉండటం గమనార్హం. ఎక్కడ తేదీలను మిస్ అయిపోతామనే ఆత్రమే ఇక్కడ ఎక్కువ కనిపిస్తోంది. రాధే శ్యామ్ వాయిదా పడినట్టు […]
సంక్రాంతి పోరులో నువ్వా నేనా అనే రీతిలో తలపడిన మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎట్టకేలకు భారీ వసూళ్లతో తమ యుద్ధాన్ని ముగించారు. లక్కీగా 50 రోజుల తర్వాత కరోనా ఎటాక్ అయ్యింది కానీ లేదంటే ఈ రెండు సినిమాలు చాలా నష్టపోయేవి. అయితే జనం అభిప్రాయంలో, బాక్స్ ఆఫీస్ వసూళ్ల లెక్కల్లో బన్నీ విన్నర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాకూ నాన్ బాహుబలి రికార్డులు వచ్చాయని సరిలేరు నీకెవ్వరు టీమ్ చెప్పుకుంది కాని […]
సంక్రాంతి పండక్కి పోటీ ఎంత ఉన్నా అన్నింటికన్నా ఎక్కువగా యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నవాటిలో అల వైకుంఠపురములోదే మొదటి స్థానం. సరిలేరు నీకెవ్వరు సైతం వసూళ్లు బాగానే రాబడుతున్నప్పటికీ టాక్ పరంగా కొంత డివైడ్ నడుస్తున్న మాటా వాస్తవం. అది ఓవర్సీస్ కలెక్షన్స్ లో స్పష్టంగా బయటపడుతోంది కూడా. ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న బన్నీ సరైన సినిమాతో వచ్చాడని అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వైకుంఠపురములో విజయానికి కారణమైన సూత్రాలేంటో చూద్దాం 1. ట్రీట్మెంట్ […]
తెలుగునాట సంక్రాంతి సినిమాల సందడి ఒక రేంజ్ లో ఉంది. చాలా రోజుల తర్వాత అన్ని థియేటర్లు జనంతో కళకళలాడుతున్నాయి. మల్టీ ప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు అనే తేడా లేకుండా కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే దర్బార్, సరిలేరు నీకెవ్వరు వచ్చేసాయి. నెక్స్ట్ అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురాతో రేస్ పూర్తవుతుంది. టాక్స్ రిపోర్ట్స్ సంగతి పక్కనపెడితే ఈ మొదటి వారమంతా సెలవుల పుణ్యమాని కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 10న మరో రెండు క్రేజీ […]
“వచ్చేసేడూ.. ఏటా ఠంఛనుగా వచ్చి వాయించుతాడు. వేరే పనేం లేదు..చలి మొదలై.. ఈ సౌండినపడిందంటే.. గుండెల్లో.. రైళ్ళు పరిగెడతాయ్. ఈ హరిదాసుకి అసలు పనే ఉండదు”. గంగిగోవులాంటి హరిదాసుని తిట్టుకోడానికి నాకు నోరెలా వచ్చిందీ అనుకుంటున్నారు కదా. అసలు ముందు నేనెవరో తెలియాలి మీకు. మామూలూ రోజుల్లో… కంచంలోకి, ఇలాంటి రోజుల్లో బరిలోకి బలైపోయే కోడి జాతి పుంజుని నేను. కోడిపుంజంటారు లేండి. ఇలాంటి రోజుల్లో అయితే.. పరువూ ప్రతిష్ట అని కూడా అంటుంటారు. అవన్నీ శవానికి […]
‘ఈపాటికి రైలొచ్చేసే వుంటుంది. మీరింకా నీళ్ళూ పోసుకోలేదు, జపఁవూ కానివ్వలేదు. తొరగా లేచి తెమలండి!’ భార్య చదువుతున్న స్తవానికి చదువుతున్న పేపరు పక్కనబడేసి భుజాన తువ్వాలేసుకుని లేచాడు సీతారాఁవుడు. ఏడుగంటల బండికి దిగుతాన్నాడు లక్షినాణ…అదే…బాపు! కాలవగట్టున నిలబడి చెంబుతో నీళ్ళుపోసుకోడం అలవాటు సీతారాఁవుడికి. చప్టాలు జారుతున్నాయి. చల్లటి నీళ్ళలో కొబ్బరాకుల నీడలు నిలకడగా, నిశ్శబ్దంగా కదులుతున్నాయి. గోదారి కాలవగట్టునే ఇల్లు. పెరటిగుమ్మంలోంచి బయటకి రాగానే గలగల్లాడుతూ కనబడుతూ వుంటుంది. దూరంగా వేణుగోపాలస్వామి గుళ్ళోంచి గంటలు మృదువుగా వినబడుతున్నాయి. […]