iDreamPost

కాబోయే భర్తపై విమర్శలు.. మీకేందుకంటూ ఇచ్చి పడేసిన వరలక్ష‍్మీ శరత్‌ కుమార్‌

  • Published Apr 30, 2024 | 11:11 AMUpdated Apr 30, 2024 | 11:11 AM

ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనదైన బిజీగా దూసుకుపోతున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కాగా, ఇటీవలే ఈ అమ్మాడు తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా వరలక్ష్మీ శరత్ కుమార్ పై విపరీతంగా ట్రోలింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తనపై వస్తున్న రూమార్స్ కు వరలక్ష్మీ రియాక్ట్ అయిన తనదైన స్టైల్ లో సమాధానం తెలిపింది.

ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనదైన బిజీగా దూసుకుపోతున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కాగా, ఇటీవలే ఈ అమ్మాడు తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా వరలక్ష్మీ శరత్ కుమార్ పై విపరీతంగా ట్రోలింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తనపై వస్తున్న రూమార్స్ కు వరలక్ష్మీ రియాక్ట్ అయిన తనదైన స్టైల్ లో సమాధానం తెలిపింది.

  • Published Apr 30, 2024 | 11:11 AMUpdated Apr 30, 2024 | 11:11 AM
కాబోయే భర్తపై విమర్శలు.. మీకేందుకంటూ ఇచ్చి పడేసిన వరలక్ష‍్మీ శరత్‌ కుమార్‌

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోకి వారసత్వంగా ఇండస్ట్రీని అడుగుపెట్టిన ఈ భామ.. తమిళ్, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అయితే పేరుకి తమిళ్ నటి అయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఈ క్రమంలోనే.. హీరోయిన్, నెగిటివ్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లను పోషించి తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఇదిలా ఉంటే.. తాజాగా తాజాగా వరలక్ష్మీ శబరి అనే మూవీలో నటించింది. కాగా, ఈ మూవీ మే3న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ అమ్మాడు వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆమె తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి వరలక్ష్మీ శరత్ కుమార్ పై వరుసగా ట్రోలింగ్స్ జరుతున్నాయి. అందుకు కారణం ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి ఇటీవలే వివాహం కావడం. ఈ సందర్భంగా తనపై వస్తున్న రూమార్స్ కు వరలక్ష్మీ రియాక్ట్ అయిన తనదైన స్టైల్ లో సమాధానం తెలిపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనదైన బిజీగా దూసుకుపోతున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కాగా, ఇటీవలే ఈ అమ్మాడు తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలు అనేవి ఇరు కుటుంబాల సమక్షంలో నిడారంబరంగా జరిగింది. ఇక ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవడానికికి సిద్ధం అవుతుంది ఈ బ్యూటీ. అయితే గత కొన్ని రోజులుగా వరలక్ష్మీ శరత్ కుమార్ పై విపరీతంగా ట్రోలింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అందుకు కారణం ఆమె ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి నికోలయ్ సచ్ దేవ్ అందుక కారణం. ఎందుకంటే..తాను పెళ్లి చేసుకోబోతున్న నికోలయ్ కు ఇంతకు ముందే వివాహితుడు కావడం విశేషం. అంతేకాకుండా.. ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. అలాంటి వ్యక్తి వరలక్ష్మీ కి ఎలా నచ్చారు డబ్బు కోసం పెళ్లి చేసుకోబోతున్నారా అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక వాటిపై తాజాగా స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్ తాను కష్టపడి పని చేస్తున్నాననీ, తన సంపాదనతో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే నికోలయ్ ను డబ్బు కోసమే పెళ్లి చేసుకోబోతున్నాని కొందరు కామెంట్స్ చేస్తున్నారనీ, అయితే అదే డబ్బు నా వద్ద కూడా ఉందని పేర్కొంది. ఇక కావలసినంత డబ్బు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు మరొకరిని డబ్బు కోసం పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నించారు.

అయితే నికోలయ్ తనకు పరిచయం అయినప్పుడు భార్యతోనే కలిసున్నారని చెప్పారు. పైగా ఆయనతో తనకు కొన్ని నెలల క్రితమే స్నేహం ఏర్పడిందన్నారు. అయితే ఆ సమయంలో ఆయన ప్రవర్తన, మర్యాద, తన ప్రొఫెషన్ పై గౌరవం చూసి తనకు ఆయనపై ప్రేమ కలిగిందన్నారు. అయినప్పటికీ నికోలయ్ తన తల్లిదండ్రులను కలిసి తనపై ఆయనకు ఉన్న ప్రేమ గురించి చెప్పారన్నారు. ఇకపోతే తనకు ఆయన ఎలా నచ్చారు అనే కామెంట్స్ చేస్తున్నారనీ, తన కళ్లకు ఆయన నచ్చారనీ బదులిచ్చారు. అంతేకాకుండా.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా జీవించడం లేదా అని వరలక్ష్మీ శరత్ కుమార్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మరి, వరలక్ష్మీ తనపై వస్తున్న ట్రోలింగ్ పై తనదైన స్టైల్ లో స్పందించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి