iDreamPost

ఏసీ మెకానిక్‌గా వెళ్లి స్టార్ హీరో అయిన మహేష్ విలన్ ఎవరో తెలుసా?

  • Published Apr 29, 2024 | 10:19 PMUpdated Apr 29, 2024 | 10:19 PM

ఏసీ మెకానిక్ గా ఒక లెజెండరీ హీరో ఇంటికి వెళ్లి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ విలన్ ఎవరో తెలుసా? అతని లైఫ్ జర్నీ తెలుసుకుంటే మీరు ఏ మాత్రం నిరాశ చెందరు.

ఏసీ మెకానిక్ గా ఒక లెజెండరీ హీరో ఇంటికి వెళ్లి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ విలన్ ఎవరో తెలుసా? అతని లైఫ్ జర్నీ తెలుసుకుంటే మీరు ఏ మాత్రం నిరాశ చెందరు.

  • Published Apr 29, 2024 | 10:19 PMUpdated Apr 29, 2024 | 10:19 PM
ఏసీ మెకానిక్‌గా వెళ్లి స్టార్ హీరో అయిన మహేష్ విలన్ ఎవరో తెలుసా?

అదృష్టం అందరికీ రాదు.. కొందరికే వస్తుంది అని నిరాశ, నిస్పృహతో జీవిస్తుంటారు. అయితే అలా నిరుత్సాహపడేవారికి కూడా ఏదో ఒక రోజు అదృష్టం కలిసి వస్తుంది. ఈ మాటను చాలా మంది ప్రూవ్ చేశారు. లేదంటే ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకైన చిరంజీవి, బస్ కండక్టర్ అయిన రజినీకాంత్, బస్ కండక్టర్ కొడుకైన యష్ వంటి హీరోలు ఎలా ఇంత సక్సెస్ అవుతారు. టాలెంట్ ఉందన్నమాట నిజమే కానీ టాలెంట్ తో పాటు అదృష్టం, ఆ దేవుడి చల్లని చూపులు కూడా ఉండాలని అంటారు. అయితే ఎంత ప్రయత్నించినా గానీ అదృష్టం రాలేదని బాధపడుతుంటారు. అలా బాధపడుతున్న ఒక ఏసీ మెకానిక్ అనుకోకుండా స్టార్ అయిపోయారు. అలాంటి ఇలాంటి హీరో కాదు. అతని యాక్టింగ్ కి జనాలు పిచ్చెక్కిపోతారు. ఏసీ బాగుచేయడానికి వెళ్లిన ఒక సాధారణ మెకానిక్ స్టార్ హీరో ఎలా అయ్యారో తెలుసా? అతని జర్నీ తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

అతను మరెవరో కాదు.. బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్. సామాన్యుడిగా ఉన్న ఇర్ఫాన్.. స్వయంకృషితో స్టార్ గా ఎదిగారు. సలామ్ బాంబే సినిమాతో 1988లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ ఖాన్.. విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ సినిమాలతో పాటు బ్రిటిష్, అమెరికన్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. స్లమ్ డాగ్ మిలియనీర్, ఇన్ఫెర్నో, లైఫ్ ఆఫ్ పై సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో మహేష్ బాబు నటించిన సైనికుడు మూవీలో పప్పు క్యారెక్టర్ లో తెలుగు వాళ్ళని కూడా మెప్పించారు. 30 ఏళ్లకు పైగా సినీ కెరీర్ లో జాతీయ అవార్డు సహా ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్.. సినిమాల్లోకి రాకముందు ఏసీ మెకానిక్ గా పనిచేసేవారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కి చెందిన ఇర్ఫాన్ ఖాన్.. చిన్నతనంలో నాటకాలు వేసేవారు.

ఆ సమయంలో థియేటర్ ఆర్టిస్ట్ అయిన తన మేనమామ ప్రేరణతో నటన వైపు ఆసక్తి మల్లింది. ఎలాగైనా హీరో అవ్వాలని అనుకున్నారు. జైపూర్ లో నాటక రంగానికి చెందిన ఆరిస్టులతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళ ప్రోత్సాహంతో అనేక నాటకాల్లో నటించారు. జైపూర్ లో ఎంఏ పూర్తి చేసిన తర్వాత 1984లో ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరారు. అక్కడ 300 రూపాయలు చెల్లించేవారు. ఆ తర్వాత ముంబై వచ్చిన ఇర్ఫాన్ ఖాన్.. కుటుంబం కోసం ఏసీ మెకానిక్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. హీరో అవ్వాలన్న కలకు బ్రేకులు వేసేశారు.

అయితే ఒక రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఇంట్లో ఏసీ ఫిక్స్ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో రాజేష్ ఖన్నాను చూసిన ఇర్ఫాన్ ఖాన్ మైండ్ లో ఒకటే ఫిక్స్ అయ్యారట. తాను కూడా హీరో అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయారట. అలా ఏసీ మెకానిక్ గా కొన్ని రోజులు పని చేసి హీరోగా ప్రయత్నాలు చేశారు. కట్ చేస్తే సూపర్ స్టార్ గా భారతదేశం గర్వించతగ్గ నటుడిగా నిలిచారు. భౌతికంగా మన మధ్య ఆయన లేకపోయినా తన సినిమాలతో ఎప్పుడూ జీవించే ఉంటారు. మరి ఏసీ మెకానిక్ గా వెళ్లి సూపర్ స్టార్ గా ఎదిగిన ఇర్ఫాన్ ఖాన్ లైఫ్ జర్నీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి