iDreamPost

తేలిపోయిన సంక్రాంతి.. సరైన సినిమా రాలేదు!

ఈ సంక్రాంతికి స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి చెప్పుకోదగ్గ ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో ఒక్కటి కూడా హిట్ టాక్ తెచ్చుకోకపోవడం గమనార్హం.

ఈ సంక్రాంతికి స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి చెప్పుకోదగ్గ ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో ఒక్కటి కూడా హిట్ టాక్ తెచ్చుకోకపోవడం గమనార్హం.

తేలిపోయిన సంక్రాంతి.. సరైన సినిమా రాలేదు!

సంక్రాంతి పండుగ తెలుగునాట సినిమాలకు వసూళ్ల వర్షం కురిపించే పండుగ. అందుకే సంక్రాంతికి సినిమాలు విడుదల చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ఈ సంక్రాంతికి స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి చెప్పుకోదగ్గ ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో ఒక్కటి కూడా హిట్ టాక్ తెచ్చుకోకపోవడం గమనార్హం.

ముందుగా జనవరి 11న తమిళ్ మూవీ తునివు తెలుగులో తెగింపు పేరుతో విడుదలైంది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో మనీ హైస్ట్ వెబ్ సిరీస్ ఛాయలు ఉన్నాయి గానీ సినిమా మాత్రం తేలిపోయింది అనే కామెంట్స్ వినిపించాయి. పైగా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల ముందు నుంచి అంతగా ఆసక్తి చూపలేదు. ఇక విడుదల తర్వాత టాక్ కూడా గొప్పగా లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవట్లేదు.

జనవరి 12న నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విడుదలైంది. ఈ సినిమా ఫ్యాన్స్ ని అలరించేలా ఉందనిపించుకుంది కానీ హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేదు. బాలకృష్ణ పాత ఫ్యాక్షన్ సినిమాలను కలిపి తీసినట్లు ఉందనే టాక్ తెచ్చుకుంది. దానికి తోడు ఇందులో మితిమీరిన హింస ఉండటంతో.. పిల్లలను తీసుకొని ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు.

జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదలైంది. ఇది కూడా పూర్తిగా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. సాధారణ ప్రేక్షకులకు మెప్పించే అంశాలు పెద్దగా లేవు. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాత టెంప్లేట్ లో తీసిన సినిమాగా పేరు తెచ్చుకుంది. చిరంజీవి కామెడీ అదిరిపోయింది, వింటేజ్ మెగాస్టార్ ని చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ కి అయితే పూనకాలు లోడింగ్ కానీ.. జనరల్ ఆడియెన్స్ నుంచి మాత్రం పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు.

జనవరి 14న తమిళ్ మూవీ వారిసు తెలుగులో వారసుడు పేరుతో విడుదలైంది. ఇది కూడా తెలుగులో ఇప్పటికే చూసేసిన సినిమాల్లా ఉందని, కొన్నికొన్ని సన్నివేశాలు మరీ సాగదీతగా ఉన్నాయంటూ యావరేజ్, బిలో యావరేజ్ టాక్ కే పరిమితమైంది.

ఇక 14వ తేదీనే తెలుగు సినిమా కళ్యాణం కమనీయం కూడా విడుదలైంది. సంక్రాంతి సీజన్ లో ఒక్కోసారి చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తూ ఉంటాయి. అలాంటి మ్యాజిక్ చేసే ఛాన్స్ ని కళ్యాణం కమనీయం మిస్ చేసుకుంది. షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, సినిమాకి తక్కువ అన్నట్లుగా ఉన్న ఈ చిత్రం.. ఓటీటీ వరకు ఓకే గానీ థియేటర్ లో అంటే కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సింపుల్ స్టోరీ లైన్ తీసుకొని తీసిన ఈ చిత్రం ఎలాంటి అసభ్యత లేకుండా కుటుంబమంతా చూడదగ్గ సినిమాలా ఉంది కానీ.. వచ్చిన ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించేలా లేదు. కామెడీ డోస్ పెంచినట్లుతే.. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ అయ్యుండేది. కానీ ఇప్పుడు యావరేజ్ టాక్ తో ఓటీటీ ఫిల్మ్ అనే పేరు తెచ్చుకుంది.

ఇలా ఈ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో ఏదీ కూడా పూర్తి స్థాయిలో హిట్ టాక్ సొంతం చేసుకోలేక పోయింది. అయినప్పటికీ పండగ సెలవుల కావడంతో ప్రస్తుతానికి వసూళ్లు అయితే బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మంచి వసూళ్లు రాబడుతున్నాయి. మొత్తానికి చిరు ఫాన్స్ ని మెప్పించేలా వాల్తేరు వీరయ్య, బాలయ్య ఫ్యాన్స్ ని మెప్పించేలా వీరసింహారెడ్డి ఉన్నాయి కానీ.. అందరినీ మెప్పించేలా ఈ సంక్రాంతికి సరైన సినిమా రాలేదనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి