iDreamPost

Godavari: గోదారోళ్ల ఆతిధ్యం.. కొత్త అల్లుడికి 156 రకాల వంటకాలతో!

  • Published Jan 16, 2024 | 7:22 PMUpdated Jan 16, 2024 | 7:22 PM

సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాలు.. అలాగే మర్యాదలు అంటే గోదావరి జిల్లాలు. ఈ ఏడాది గోదావరి జిల్లా ఇళ్లకు అతిధులుగా వచ్చిన అల్లుళ్లకు.. మంచి సర్ప్రైజ్ ను ఇచ్చారు వారి అత్తింటివారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాలు.. అలాగే మర్యాదలు అంటే గోదావరి జిల్లాలు. ఈ ఏడాది గోదావరి జిల్లా ఇళ్లకు అతిధులుగా వచ్చిన అల్లుళ్లకు.. మంచి సర్ప్రైజ్ ను ఇచ్చారు వారి అత్తింటివారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published Jan 16, 2024 | 7:22 PMUpdated Jan 16, 2024 | 7:22 PM
Godavari: గోదారోళ్ల ఆతిధ్యం.. కొత్త అల్లుడికి 156 రకాల వంటకాలతో!

సంక్రాంతికి వ్యవసాయ పండుగతో పాటు మరో ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. దానినే అల్లుళ్ళ పండుగా అని అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఏటా సంక్రాంతికి అల్లుడు అత్తవారి ఇంటికి వెళ్లడం ఆనవాయితీ. ఇంకా మాములు రోజుల్లోనే అల్లుడు తమ ఇంటికి వచ్చాడంటే మర్యాదలు చేయడం సహజం. అలాంటిది పెద్ద పండుగ సమయంలో వచ్చాడంటే ఇంకా వారి మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందులోను గోదావరి జిల్లాలు ఈ మర్యాదలకు పెట్టింది పేరు. ఎవరైనా ఈ మాటను ఒప్పుకుని తీరాల్సిందే. చాలా వరకు అబ్బాయిలు.. అయితే గోదావరి అల్లుడు అవ్వాలి అని సరదాగా అనుకుంటూనే ఉంటారు. అంతలా అందరి మనస్సును ఆకట్టుకుంటాయి ఈ గోదావరి అతిధి మర్యాదలు. ఇక ప్రతి ఏడు లానే ఈ ఏడు సంక్రాంతికి తమ ఇంటికి వచ్చిన అల్లుడికి.. ఘనంగా మర్యాదలు చేసి వార్తల్లో నిలిచారు కొంతమంది గోదారోళ్ళు.

ఈ ఏడాది అంతటా పండుగ వాతావరణం చాలా ఘనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు ఈ పండుగ సంబరాలకు పెట్టింది పేరు. ఇంకా వీళ్ళ అతిధి మర్యాదల గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే.. పండుగకు తన ఇంటికి ఆహ్వానించిన అల్లుడికి ఏకంగా తన అత్తింటివారు 156 రకాల వంటకలతో కనువిందు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన కిరాణా వ్యాపారి కుమారుడికి.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి చవ్వా నాగ వెంకట శివాజీ కూతురుకి వివాహం జరిగింది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగకు తన ఇంటికి కూతురుని అల్లుడిని ఆహ్వానించాడు శివాజీ. ఇందులో భాగంగానే అల్లుడికి వెండి కంచంలో 156 వరకు వివిధ రకాల వంటలు పెట్టి రుచి చూపించారు. సంప్రదాయ పద్ధతిలో చక్రపొంగలి, చక్కిరాలు, కోనసీమ పూతారేకులు, కాకినాడ కాజా, బెంగుళూరు కోవ, రాజస్థాన్ ప్రాంతాల నుంచి విభిన్న రకాల వంటకాలను వడ్డించి.. కొసరి కొసరి తినిపించారు. అల్లుడికి అత్తింటి రుచి, గోదావరి వాళ్ళ ప్రేమ, మమకారాలను చూపేందుకు మూడు రోజుల్లో 100 రకాల పిండి వంటకాలను స్వయంగా తయారు చేశారు.

అంతే కాకుండా స్వీట్స్ తో పాటు పండ్లను కూడా అందించారు. ఆశాడం సారె కాకుండా సంక్రాంతి కూడా ఈ విధంగా ఇన్ని రకాల వంటకాలు, స్వీట్ లతో.. తమ ప్రేమను కలబోసి కొసరి కొసరి అల్లుడికి మర్యాద చేయడం.. కేవలం గోదారొళ్లకే సొంతమని మరోసారి నిరూపించారు. ఈ విషయమై వారి అల్లుడు రిశీంద్ర మాట్లడుతూ.. తన మామయ్య ఇన్ని రకాల వంటలతో తనను సర్ప్రైజ్ చేయడం చాల ఆనందంగా ఉందంటూ..దీనిని చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటూ నోర్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా మర్యాదల విషయంలో గోదారోళ్ళు ఓ మెట్టు ఎక్కువే ఉంటారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి