iDreamPost

Prabhas: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ బీ రెడీ.. సంక్రాంతికి డబుల్ ధమాకా!

ఇప్పటికే సలార్‌తో సూపర్‌ హిట్‌ అందుకున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మస్తు ఖుషీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా సలార్‌తో ప్రభాస్‌ ప్రభంజనం నడుస్తోంది. అయితే.. కొత్త ఏడాదిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా ఉండనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఇప్పటికే సలార్‌తో సూపర్‌ హిట్‌ అందుకున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మస్తు ఖుషీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా సలార్‌తో ప్రభాస్‌ ప్రభంజనం నడుస్తోంది. అయితే.. కొత్త ఏడాదిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా ఉండనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Prabhas: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ బీ రెడీ.. సంక్రాంతికి డబుల్ ధమాకా!

సలార్ విడుదలై సూపర్ హిట్ టాక్ తో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకూ ప్రభంజనంలా కొనసాగుతోంది. చాలా కాలం నుంచి ఇటువంటి సంబరాల కోసం ముఖం వాచిపోయి ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కి 2023 సంవత్సరం చివరి భాగం మంచి పండగనే ఇచ్చింది. నెలరోజుల వ్యవధిలో పెద్ద పండగ వస్తోందనగా నెల ముందే ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం గేరప్ అయిపోయింది. సలార్ వసూళ్ళు సంచలనం రేపుతున్నాయి. ప్రభాస్ కుండే బాహుబలి ఇమేజ్ ని పటిష్టపరస్తూ, దానిని మరింత పెంచగలిగే రేంజ్ కి ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఇమేజ్ ని పదునుబెట్టగలిగాడు.

డంకీ సినిమాని ఓవర్ టేక్ చేసి మరీ సలార్ దూసుకుపోతుండగానే ప్రభాస్ అభిమానులకు మరో రెండు ముఖ్యమైన వార్తలు మరింత పండగ చేశాయి. ఒకటి మారుతి, ప్రభాస్ కాంబినేషన్లో పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి సందర్భంగా నూతన సంవత్సరం సందడిలో విడుదల కాబోతోంది. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ అన్నప్పుడే ఇదేదో వెరైటీ ఎంటర్ టైనర్ అన్న ఫీలింగ్స్‌ క్యారీ చేస్తూ వచ్చింది. కాకపోతే దీని గురించి ఎవరూ ఎక్కడా ఎప్పుడూ పెదవి విప్పలేదు. అంతా సైలెంట్ వార్ లా సాగుతోంది.

దీనికన్నా ముందు వైజయంతీ మూవీస్ సంస్థ, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD మరొక పెను ప్రభంజనం కాబోతుందని పరిశ్రమలో కొందరు ముఖ్యులే కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకి చాలా ప్రాథాన్యత ఏర్పడింది. ఇంతకు ముందు జూలై 20న లండన్లో సాన్ డియ్గోలో కల్కి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసిన తొలి నాన్ హాలీవుడ్ ఫిల్మ్ గా కల్కి సినిమా పెద్ద్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. అప్పట్నుంచే కల్కి సినిమాకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఎక్కువైపోయింది. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి ఒక షాకింగ్ సర్పరైజ్ తో కల్కి టీం ప్రభాస్ ఫేన్స్ కి పండగ చేయబోతున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ప్రభాస్ మంచి ఫామ్‌లోకి వచ్చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి