iDreamPost

భారత్ అగ్రరాజ్యంగా ఎదుగుతుంటే.. మేము అడుక్కుంటున్నాం..

పక్కవాడి నాశనం కోసం ఆలోచిస్తే..అది మనల్ని పాతాళంలోకి తొక్కేస్తుంది. అది మనుషుల విషయంలో కావచ్చు, దేశాల విషయంలో కావచ్చు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే పాకిస్తాన్ ఉంది. అదే విషయాన్ని స్వయంగా ఆ దేశానికి చెందిన అగ్రనేత తెలిపారు.

పక్కవాడి నాశనం కోసం ఆలోచిస్తే..అది మనల్ని పాతాళంలోకి తొక్కేస్తుంది. అది మనుషుల విషయంలో కావచ్చు, దేశాల విషయంలో కావచ్చు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే పాకిస్తాన్ ఉంది. అదే విషయాన్ని స్వయంగా ఆ దేశానికి చెందిన అగ్రనేత తెలిపారు.

భారత్ అగ్రరాజ్యంగా ఎదుగుతుంటే.. మేము అడుక్కుంటున్నాం..

ఎప్పుడైనా మంచి ఆలోచనలతో ఉండే ఉన్నత స్థితికి చేరుకుంటాము. పక్కవాడి నాశనం కోసం ఆలోచిస్తే..అది మనల్ని పాతాళంలోకి తొక్కేస్తుంది. అది మనుషుల విషయంలో కావచ్చు, దేశాల విషయంలో కావచ్చు. ప్రస్తుతం ఇలాంటి  రెండు విభిన్నమైన ఆలోచనలు కలిగిన రెండు దేశాల పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. భారత్ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేస్తోంది. అలానే అగ్రరాజ్యంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తుంది. ఇదే సమయంలో ఎప్పుడు పక్క దేశంపై అసుయ పడే పాకిస్థాన్ మాత్రం ప్రస్తుతం అడుక్కునే స్థితిలోకి వెళ్లింది. ఈ మాట మనం ఎవరం చెప్పడం లేదు.. స్వయంగా ఆ దేశానికి చెందిన ఓ ముఖ్యనేతనే చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పాకిస్థాన్ దేశంలో కీలక నేత,  జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్) ప్రెసిడెంట్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ భారత దేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. అది కూడా ఎక్కడో మీడియా పాయింట్లో అనుకుంటే పొరపాటు.. ఏకంగా పాక్ పార్లమెంట్ లోపలనే ఇండియాను ప్రశంసించారు. నేడు భారత్ అగ్రరాజ్యంగా అవతరించేందుకు అడుగులు వేస్తుంటే.. ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురు చూసే స్థితిలో పాకిస్థాన్ ఉందని ఆయన తెలిపారు. ప్రపంచ  బ్యాంక్ తో పాటు  ఇతర దేశాల దగ్గర తమను ఆర్థికంగా ఆదుకోవాలని అడుక్కునే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.

ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులని మౌలానా ప్రశ్నించారు. పాకిస్థాన్ లోని పొలిటికల్ లీడర్స్ ఇండియాను ఎంత వ్యతిరేకించినా, భారత్ అభివృద్దిలో పాకిస్థాన్ కంటే చాలా ముందుకెళ్లిందన్న విషయాన్ని ఆ నేతలు అంగీకరించాలని మౌలాన అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కొందరి చేతుల్లో కీలుబొమ్మలుగా మార్చడం వల్లే దేశం ఈ పరిస్థితిని అదృశ్య శక్తులే  కారణమని రెహ్మాన్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు మౌలిక సూత్రాలను వదిలి ప్రజాస్వామ్యాన్ని అమ్ముకోవడంలో బిజీగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు నిజంగా ప్రజల ఆశలను, ఆశయాలను ప్రతిబింబిస్తుందా?  అని ప్రశ్నించారు. అలానే ఈ దేశంలో రాజభవనాలతో, బ్యూరోక్రాట్లచే ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..ఎంతకాలం సర్థుకుని పోతుంటామని, ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు బయటి శక్తుల సహాయం ఎంతకాలం కొనసాగిస్తాం? అని రెహ్మాన్ ప్రశ్నించారు. 2018, 2024 ఎన్నికలలో పలు చోట్ల జరిగిన రిగ్గింగ్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. చట్టాలను స్వతంత్రంగా రూపొందించడానికి  ఉన్న ప్రజాప్రతినిధుల శక్తిరాహిత్యంపై రెహ్మాన్ విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్  బహిరంగ సభలను నిర్వహించకునేందుకు ప్రభుత్వం అనుమతించాలని రెహ్మాన్ డిమాండ్ చేశారు. మే 2, 9 తేదీల్లో కరాచీ, పెషావర్‌ల్లో ‘మిలియన్ మార్చ్’ కోసం పీటీఐ ప్రణాళికలు ప్రకటించింది. ఈ ప్రదర్శనలను అడ్డుకోవడం ప్రతికూల పరిస్థితులకు దారి తీస్తుందని మౌలానా అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి