iDreamPost

సంక్రాంతి కీడుతో వస్తుందా? కొడుకు ఉన్న వాళ్ళు పరిహారం చేయాలా? అసలు నిజం?

Sankranti 2024: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ‘‘ ఈ సంక్రాంతి కీడుతో వస్తోంది. ఒక్క కొడుకు ఉన్న వాళ్లు గాజుల పరిహారం ఇ‍వ్వాలి ’’ అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

Sankranti 2024: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ‘‘ ఈ సంక్రాంతి కీడుతో వస్తోంది. ఒక్క కొడుకు ఉన్న వాళ్లు గాజుల పరిహారం ఇ‍వ్వాలి ’’ అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

సంక్రాంతి కీడుతో వస్తుందా? కొడుకు ఉన్న వాళ్ళు పరిహారం చేయాలా? అసలు నిజం?

రెండు తెలుగు రాష్ట్రాల్లో  సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఊర్లకు వెళ్లే వారు వెళ్లిపోతూ ఉన్నారు. ఈ ఏడాది 13వ తేదీనుంచి పండగ మొదలవ్వనుంది. 15 తేదీ మకర సంక్రాంతి పండగ జరగనుంది. అయితే, గతకొద్దిరోజుల నుంచి సంక్రాంతి పండగ చుట్టూ ఓ ప్రచారం జోరుగా నడుస్తోంది. ‘‘ ఈ సంక్రాంతి కీడుతో వస్తోంది. ఒక్క కొడుకు ఉన్న వాళ్లు గాజుల పరిహారం ఇ‍వ్వాలి ’’ అన్న ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ ప్రచారాన్ని ప్రముఖ పండితుడు ‘‘బ్రహ్మశ్రీ సుభాష్‌ శర్మ’’ ఖండించారు.

ఈ సంక్రాంతి కీడుతో వస్తోంది. ఒక్క కొడుకు ఉన్న వాళ్లు గాజుల పరిహారం ఇ‍వ్వాలి అనే దాన్ని కొట్టి పారేశారు. జ్యోతిష్యంలో కానీ, ధర్మంలో కానీ ఇలాంటిది లేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఒక సంతానం ఉన్న వారి దగ్గరినుంచి.. గాజులు తీసుకుని రావాలి.. డబ్బులు తీసుకుని రావాలి అనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో.. అది పూర్తిగా విరుద్ధమైనటువంటిది. అలాంటి నియమాలు ఎక్కడా కూడా చెప్పటం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతర చోట్ల బాగా వైరల్‌ చేస్తున్నారు తప్ప.. జ్యోతిష్యంలో ఇలాంటి వాటి గురించి ఎక్కడా చెప్పలేదు. ధర్మంలో కూడా ఎక్కడ కూడా చెప్పటం లేదు. సంక్రాంతి వంటిది ఓ పండగ వాతావారణం. పండగ వాతావరణంలా జరుపుకోవాలి.

కీడు దినాలు.. పుష్య మాసం అంటే శుభకార్యాలకు నిషిద్ధమైనటువంటిది. మనుష్యులకు సంబంధించి తప్ప.. దేవుళ్లకు సంబంధించిన శుభకార్యాలు చేయాలని చెప్పిందే ఈ సంక్రాంతి’’ అని అన్నారు. మంచి పనుల్లో భాగంగా ఏవైనా వస్తువులు దానం ఇవ్వటం చేయాలని అన్నారు. సాధారణంగా హిందూ ధర్మం ప్రకారం పండగల రోజు పేదలకు ఏవైనా దానం ఇవ్వటం పరిపాటి. మనస్పూర్తిగా ఇలాంటి కార్యాలు చేయటం వల్ల దానం ఇచ్చిన వారు.. దానం తీసుకున్న వారు ఇద్దరూ సంతోషంగా ఉంటారు.

కానీ, ‘‘ ఈ సంక్రాంతి కీడుతో వస్తోంది. ఒక్క కొడుకు ఉన్న వాళ్లు గాజుల పరిహారం ఇ‍వ్వాలి ’’లాంటి ప్రచారాల వల్ల జనాల్లో భయం నెలకొంటుంది.  పైగా ఇలాంటి వాటిని ఫాలో అవ్వటం వల్ల ఖర్చు పెరగటం తప్ప ఎలాంటి లాభం ఉండదు. దానికి తోడు మూఢనమ్మకాలను ప్రోత్సహించినట్లు ఉంటుంది. కాబట్టి.. జనం ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. మరి, ఈ సంక్రాంతి కీడుతో వస్తోంది. ఒక్క కొడుకు ఉన్న వాళ్లు గాజుల పరిహారం ఇ‍వ్వాలన్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి