iDreamPost

2022 Sankranthi : వాయిదా వేసుకున్నోళ్ళే ధన్యులు సుమతీ

2022 Sankranthi : వాయిదా వేసుకున్నోళ్ళే ధన్యులు సుమతీ

ఇక్కడ టఫ్ అంటే సినిమాల మధ్య పోటీ గురించి అనుకునేరు. కాదండి. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అలుముకున్న పరిస్థితుల గురించి. తీవ్ర ప్రభావం లేదనుకుంటూనే ఒమిక్రాన్ పడగ మెల్లగా కమ్ముకుంటోంది. ఏపిలో నైట్ కర్ఫ్యూలతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ రాబోతున్నాయన్న వార్తలు డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కేసుల పెరుగుదల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పండగ సీజన్ నే నమ్ముకుని వస్తున్న సినిమాలకు ఇదో సవాల్ లాంటిదే. పైగా టికెట్ పెంపుదల, అదనపు షోలు లాంటి వెసులుబాట్లు లేకపోవడంతో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే తప్ప పెట్టుబడులు వెనక్కు రావడం కష్టం.

సరే ఇదంతా పద్ధతి ప్రకారం, రూల్ ప్రకారం జనాల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలు కాబట్టి తప్పుబట్టడానికి ఏమి లేదు. తెలంగాణలో చూస్తేనే అక్కడ సిచువేషన్ ఇంకో తరహాలో ఉంది. ఆంక్షలు లేవు కానీ పండగ సినిమాలను క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతో జిఓని సాకుగా చూపి చాలా మల్టీ ప్లెక్సులు టికెట్ రేట్లను 295 రూపాయల దాకా పెట్టేశాయి. కొన్ని స్క్రీన్లకు రౌడీ బాయ్స్ లాంటి కొత్త హీరో సినిమాకు కూడా ఇదే ధరని డిసైడ్ చేయడం అసలు ట్విస్ట్. ఇలా అయితే కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడుతుందని, ఏదో పాన్ ఇండియా చిత్రాలకు డబ్బులు ఎంతైనా ఇస్తారు కానీ ఇలా ప్రతిదానికి అడిగితే దెబ్బ మనకే పడుతుందని నిర్మాతల కామెంట్.

సో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన వాతావరణం నెలకొనడంతో వాయిదా వేసుకున్న వాళ్ళే ధన్యులు సుమతి అనుకోవాల్సి వస్తోంది. ఒకవేళ రాధే శ్యామో లేదా ఆర్ఆర్ఆరో రేస్ లో ఉంటె ఏం జరిగేదో ఊహించడం కూడా కష్టమే. పబ్లిక్ లో కరోనా తాలూకు భయం మాత్రం మళ్ళీ స్టార్ట్ అయిన మాట వాస్తవం. గత ఏడాది కూడా ఆంక్షలు ఉన్నప్పటికీ క్రాక్, మాస్టర్ లాంటి సినిమాలు మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. కానీ అప్పటికి వైరస్ తగ్గుముఖం పట్టిన సమయం కాబట్టి ఇబ్బందులు రాలేదు. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. మరి ఇలాంటి టఫ్ సీన్ నుంచి సంక్రాంతి సినిమాలు ఎలా గట్టెక్కుతాయో చూడాలి మరి

Also Read : Hero Trailer : కమర్షియల్ మీటర్ లో గల్లా హీరో ప్రెజెంటేషన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి