iDreamPost

Sankrathi: కనుమ నాడు ప్రయాణం ఎందుకు చేయకూడదు? అసలు కారణం?

  • Published Jan 16, 2024 | 12:23 PMUpdated Jan 16, 2024 | 12:33 PM

సంక్రాంతి పండుగను అందరు అంత్యత వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే, మూడు రోజులలో ఆఖరి రోజైన కనుమ పండుగ రోజున ప్రయాణాలు చేయకూడదనే నానుడి ఉంది. దానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగను అందరు అంత్యత వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే, మూడు రోజులలో ఆఖరి రోజైన కనుమ పండుగ రోజున ప్రయాణాలు చేయకూడదనే నానుడి ఉంది. దానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం.

  • Published Jan 16, 2024 | 12:23 PMUpdated Jan 16, 2024 | 12:33 PM
Sankrathi: కనుమ నాడు ప్రయాణం ఎందుకు చేయకూడదు? అసలు కారణం?

ప్రస్తుతం రెండు రాష్ట్రాలు సంక్రాంతి పండుగ వైభోగంతో కళకళలాడుతున్నాయి. చేతి నిండా పనులు, కోళ్ల పందాలు, లోగిళ్ళలో పెద్ద పెద్ద రంగవల్లులు, ఇంటికి వచ్చిన అతిధులు, కొత్త అల్లుడికి చేసే మర్యాదలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ మూడు రోజుల పెద్ద పండుగను మూడు వందల అరవైదు రోజులు గుర్తిండిపోయేలా.. అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఈ మూడు రోజుల పండుగకు ఒక్కొక్క రోజు ఒక్కో ప్రత్యేక్యత ఉంటుంది. ముఖ్యంగా ఇది రైతుల పండుగగా జరుపుకుంటారు. రైతులకు కొత్త పంట చేతికి అందుతుంది కాబట్టి.. పాడిపంటలకు ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అయితే, ఏడాదంతా రైతులకు వ్యవసాయంలో సాయం చేసేది పశువులు కాబట్టి.. మూడు రోజుల పండుగలో మూడవ రోజును పశువుల పండుగగా జరుపుకుని.. వాటిని పూజిస్తారు. దానినే కనుమ పండుగగా పిలుచుకుంటారు. అయితే, ఈ కనుమ పండుగ రోజు ప్రయాణం చేయకూడదు అనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. దాని వెనుక ఉన్న కారణం గురించి తెలుసుకుందాం.

తరతరాల నుండి వస్తున్న ఆచార వ్యవహారాల ప్రకారం.. కనుమ పండుగ రోజున ప్రయాణాలు చేయకూడదని అంటూ ఉంటారు. అలాగే కనుమ రోజున కాకి కూడా కదలదు అనే సామెత కూడా ఉంది. దానికి కారణం లేకపోలేదు. ఈ కనుమ పండుగను ప్రత్యేకించి పశువుల పండుగగా జరుపుకుంటారు. సంవత్సరమంతా రైతు కష్టంలో తోడుగా.. అండ దండగా నిలిచేది పశువులే. కాబట్టి కనీసం ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉండడం కోసం.. వాటిని గౌరవించే విధంగా.. పశువులను పూజిస్తారు. అయితే, వాటిని పూజించడానికి ప్రయాణానికి సంబంధం ఏంటి అని అనుకోవచ్బు. ఇప్పుడంటే ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళడానికి బస్సులు, రైళ్లు, కార్లు, బైకులు ఇలా రకరకాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ, పూర్వం ఎక్కడికైనా వెళ్లాలంటే ఎడ్ల బండిపైనే ప్రయాణం చేసేవారు. కాబట్టి కనీసం కనుమ పండుగ రోజైనా ఎడ్లకు విశ్రాంతిని కల్పించాలని.. పండుగ రోజు ప్రయాణం చేయకూడదనే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.

అంతేకాకుండా కొందరు పితృదేవతల అనుగ్రహం కోసం వారిని పూజిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆరోజు కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మ శాంతి కోసం.. నైవేద్యం సమర్పిస్తారు. ఆరోజున వారి పట్ల కృతజ్ఞతా పూర్వకంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని.. ప్రయాణాలు చేయడం మంచిది కాదని భావిస్తారు. అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే, వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది చెబుతూ ఉంటారు. అందుకే అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితిలోనూ కనుమ రోజు  ఎక్కువమంది ప్రయాణాలు చేయరు. కనుమ రోజు ప్రయాణం చేయకపోడానికి ఉన్న అసలు కారణాలు ఇవి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి