iDreamPost
android-app
ios-app

నిండు సభలో మహిళలపై సీఎం అనుచిత వ్యాఖ్యలు.. దుమారం రేగడంతో..

ప్రజల తరుఫున అసెంబ్లీలో తమ గళం విప్పాల్సిన ప్రజా ప్రతినిధులు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే.. నిండు సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుమారం రేగడంతో..

ప్రజల తరుఫున అసెంబ్లీలో తమ గళం విప్పాల్సిన ప్రజా ప్రతినిధులు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే.. నిండు సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుమారం రేగడంతో..

నిండు సభలో మహిళలపై సీఎం అనుచిత వ్యాఖ్యలు.. దుమారం రేగడంతో..

ప్రజలకు జవాబు దారీగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు.. ప్రజా సమస్యలను చర్చించే నిండు సభను తమ వ్యాఖ్యలతో, చర్యలతో అగౌర పరుస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అసభ్యకరమైన వీడియోలు చూస్తూ దొరికిపోయిన నేతలున్నారు. అంతేనా.. శాసన సభలో మహిళలను ఉద్దేశించి నీచాతినీచమైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా సాగిపోతుంది. మహిళా సాధికారత అంటూనే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సరికొత్త వివాదానికి తెరలేపారు. జనాభా నియంత్రించే విషయంలో మహిళకు విద్య ప్రాముఖ్యతను చెప్పే క్రమంలో ఆయన టంగ్ స్లిప్ అయ్యింది. దీంతో రచ్చ మొదలైంది.

ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కులగణనకు సంబంధించిన నివేదికను బీహార్ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న మహిళలు.. శృంగారం సమయంలో భర్తలను ఎలా నియంత్రించాలో తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ‘భర్త చేసే పనుల వల్ల జననాలు పెరిగాయి. అయితే విద్యావంతులైన మహిళలకు.. వారిని ఎలా నిగ్రహించాలో తెలుసు. అందుకే జననాలు తగ్గిపోతున్నాయి. గతంలో సంతానోత్పత్తి రేటు 4.3గా ఉంది. కానీ అది ఇప్పుడు 2.9కి చేరింది. త్వరలో 2కి చేరుకుంటాం’ అని పేర్కొన్నారు. మహిళలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజెపీ ప్రతినిధులు మండిపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

సీఎం తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యాన్ని అగౌరపరిచారని, అసెంబ్లీలో ఇలాంటి ప్రకటన చేయడం సిగ్గు చేటు అంటూ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే వ్యాఖ్యానించారు. ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, సీఎం పదవికి రాజీనామా చేసి.. వైద్యులను సంప్రదించాలంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.. సీఎంకు మద్దతుగా నిలిచారు. ఆయన సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల తాము ఆందోళన చెందుతున్నామని.. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు సీ గ్రేడ్ మూవీ డైలాగ్‌లా ఉందని, అసెంబ్లీ స్పీకర్ అతనిపై చర్యలు తీసుకుని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు.

కాగా, ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేగడంతో.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ‘నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. ఎవరినీ నొప్పించాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. జనాభా నియంత్రణకు విద్య చాలా అవసరమన్న విషయాన్ని నేనేప్పుడూ సమర్థిస్తూనే ఉన్నాను. నేను మహిళా సాధికారిత, మహిళల అభివృద్ధి కోసం నిలబడ్డాను’ అని తెలిపారు. బుధవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీజెపీ నేతలు అడ్డుకోవడంతో ఆయన విలేకరుల సాక్షిగా క్షమాపణలు చెప్పారు.