ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి సారించింది.అందుకు రాష్ట్రంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సఫార్మేషన్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ నేతృత్వంలో గల ప్రతినిధుల బృందం మంగళవారం ఏపీ రాష్ట్ర సచివాలయానికి వచ్చింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్.జవహర్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఆ బృందం చర్చించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి […]
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం అనేక పథకాలు అమలు చేస్తూనే.. రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించడానికి గాను అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి రెండు రకాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేలా చర్యలు తీసుకుంటూ.. మిగతా రాష్ట్రాలకు […]
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అదో నిరర్ధకమైన మీటింగ్. నీతి ఆయోగ్ సిఫార్స్ లకే దిక్కులేదని, ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు. ఈ నిర్ణయం చాలా బాధాకరమే, ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం పట్ల నిరసన తెలిపేందుకు ఇది ఉత్తమమైన మార్గంగా భావించి, నేను నా నిరసన ప్రధానమంత్రికి బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నానని చెప్పారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని విమర్శించారు. […]
ఏపీ అభివృద్ధిపై నీతి అయోగ్ ప్రశంసల వర్షం కురిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్, బృందం భేటీ అయ్యారు. తలసరి ఆదాయం, వ్యవసాయం, పశుసంపద తదితర రంగాల్లో దేశసగటు కన్నా, ఏపీలో వృద్ధి బాగుందని రమేష్ చంద్ ప్రకటించారు. ఆ మేరకు గణాంకాలను సీఎంకు రమేష్ చంద్ వివరించారు. లక్ష్యాలను పెట్టుకుని, దానికి అనుగుణంగా సాగుతున్న తీరును నీతి అయోగ్ రమేష్‌చంద్ ప్రశంసించారు. పండ్లు, మత్స్య […]
ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మెరుగైన పరిపాలనతో ప్రజలకు సౌకర్యవంతమైన జీవనాన్ని అందిస్తే.. గుర్తింపు దానంతటకదే వస్తుందని చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక, వేగవంతమైన పరిపాలనపై కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నాయి. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సర్కార్ అవలంభిస్తున్న విధానాన్ని ఇటీవల నీతి అయోగ్ ప్రశంసించగా.. తాజాగా భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై సీఎం వైఎస్ జగన్ […]
దేశంలో నమోదువుతున్న 70 శాతం కరోనా వైరస్ కేసులు కేవలం 19 జిల్లాల్లోనే నమోదవుతున్నాయని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 50 శాతానికి పైగా ముంబాయి, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, థానే నగరాల్లోనే నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక తీవ్రత ముంబాయి నగరంలో కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అధికంగా ఉన్న 19 జిల్లాలు ఇవే… ముంబాయి (మహారాష్ట్ర) ఢిల్లీ (ఢిల్లీ) అహ్మదాబాద్ (గుజరాత్) చెన్నై […]
ఇక పై రేషన్ దుకాణాల్లో బియ్యం, పప్పు, చక్కర లతో పాటు గుడ్లు, మాంసం, చికెన్ కూడా పంపిణి చేయబోతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు జరిగే అవకాశం ఉంది. ‘పుష్టికర భారత్’నిర్మాణంలో భాగంగా నీతి ఆయోగ్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తోంది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలతో పాటు ప్రొటీన్ సహిత ఆహారపదార్థాలను కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా దేశంలోని పేదలకు అందజేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలి స్తోంది. గుడ్లు, చికెన్, మాంసం, చేపలను […]