iDreamPost
android-app
ios-app

వృద్ధి చాలా బాగుంది.. ఏపీపై నీతి ఆయోగ్‌ బృందం ప్రశంసలు

  • Published Jul 22, 2022 | 8:11 PM Updated Updated Jul 22, 2022 | 8:11 PM
  • Published Jul 22, 2022 | 8:11 PMUpdated Jul 22, 2022 | 8:11 PM
వృద్ధి చాలా బాగుంది.. ఏపీపై నీతి ఆయోగ్‌ బృందం ప్రశంసలు

ఏపీ అభివృద్ధిపై నీతి అయోగ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో నీతి ఆయోగ్‌ సభ్యులు రమేష్‌ చంద్, బృందం భేటీ అయ్యారు. తలసరి ఆదాయం, వ్యవసాయం, పశుసంపద తదితర రంగాల్లో దేశసగటు కన్నా, ఏపీలో వృద్ధి బాగుందని రమేష్‌ చంద్ ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు గణాంకాలను సీఎంకు రమేష్‌ చంద్‌ వివరించారు. లక్ష్యాలను పెట్టుకుని, దానికి అనుగుణంగా సాగుతున్న తీరును నీతి అయోగ్ రమేష్‌చంద్‌ ప్రశంసించారు.

పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్‌ ఒన్‌ అన్న రమేష్‌ చంద్‌, ఆయిల్‌పామ్‌ సాగును ప్ర‌స్తావించారు. వంటనూనెలు ఉత్పత్తిలో ఏపీ స్వయం సమృద్ధి సాధించిందని అన్నారు. అంద‌రూ మెచ్చుకొనే ఆర్బీకేల ద్వారా రైతులకు అత్యుత్తమ సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు. మెచ్చుకున్నారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ దేశం సగటు కన్నా ఏపీ సగటు అధికమని రమేష్‌ చంద్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా, రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సీఎం వివరించారు. ‘‘ఈ రంగాల్లో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, బడిపిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా సంపూర్ణపోషణ, గోరుముద్ద లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రతి యాభైఇళ్లకు వాలంటీర్‌ను నిమించాం, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వివక్షకు, అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా డెలివరీ మెకానిజంను సమర్థవంతంగా నడిపిస్తున్నామని’’ సీఎం నీతి అయోగ్ కు వివ‌రించారు.

డీబీటీ విధానంలో ఏపీది అగ్రస్థానమన్న సీఎం జ‌గ‌న్, పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్స‌హించ‌డానికి అమ్మ ఒడిని అమలు చేస్తున్నామన్నారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చాం. డిజిటల్‌ ఉపకరణాలతో తీర్చిదిద్దుతున్నాం. సబ్జెక్టుల వారీగా బోధనకు టీచర్లను నియమిస్తున్నామని, 6 రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వసతి దీవెన కింద కూడా ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నామన్నారు. అందువ‌ల్లే జీఈఆర్ బాగా పెరుగుతుందని సీఎం చెప్పారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకువస్తున్నాం. 3 వేలకు పైగా చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స ఇస్తున్నాం. ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరిగా మెడికల్‌ కాలేజీ ఉండేలా కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నట్టు సీఎం జ‌గ‌న్ తెలిపారు. ఆర్బీకేల వ్యవస్థ, సీఎం యాప్‌ పనితీరు తదితర అంశాలు, ఫుడ్‌ ప్రాససింగ్‌ కోసం కొత్తగా చేపడుతున్న 26 యూనిట్ల గురించి వివరించిన సీఎం .. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాలు గురించి కూడా నీతి ఆయోగ్‌ బృందానికి సీఎం జ‌గ‌న్ తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom