Arjun Suravaram
AP: దేశంలోని పేదరికం అంశంపై నీతి ఆయోగ్ ఓ నివేదకను విడుదల చేసింది. అందులో ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. అందులే ఏపీ ప్రభుత్వ పరిపాలన అద్దం పట్టేలా నివేదిక ఉంది. ఆ రిపోర్టులు చూసినట్లు అయితే జగన్ పథకాల వల్లే ఇది సాధ్యమైంది అనే భావన చాలా మందిలో కలుగుతుంది.
AP: దేశంలోని పేదరికం అంశంపై నీతి ఆయోగ్ ఓ నివేదకను విడుదల చేసింది. అందులో ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. అందులే ఏపీ ప్రభుత్వ పరిపాలన అద్దం పట్టేలా నివేదిక ఉంది. ఆ రిపోర్టులు చూసినట్లు అయితే జగన్ పథకాల వల్లే ఇది సాధ్యమైంది అనే భావన చాలా మందిలో కలుగుతుంది.
Arjun Suravaram
పేదవారు అంటే ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి దుస్తులు లేక ఇబ్బంది పడే వారని ఒకప్పుడు నిర్వహించే వారు. కానీ రోజులు మారాయి.. ఈ మూడు అవసరాలు తీరడమే కాదు.. అవి నాణ్యంగా ఉండాలి. అంతేకాక నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అలా కొనసాగించడానికి అవసరమైన వసతులు, సౌకర్యాలు వారికి అందుబాటులోకి రావాలి. అలాంటప్పుడే వారు పేదరికం నుంచి బయటపడినట్లు. అలానే నాణ్యమైన విద్య, వైద్యం వారికి అందుబాటులోకి రావాలి. మాతా శిశు మరణాలు తగ్గటం.. ఇవన్నీ జరిగితేనే పేదరికం తగ్గినట్లని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
తాజాగా దేశంలోని పేదరికం అంశంపై నీతి ఆయోగ్ ఓ నివేదకను విడుదల చేసింది. అందులో ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. నవరత్నాలతో పేదలకు అండగా నిలిచి, ప్రత్యక్షంగా ఈ నాలుగున్నరేళ్లులో ఏకంగా రూ.4.21 లక్షల కోట్లను పేదలకు ఏపీ ప్రభుత్వం అందజేసి..గణనీయమైన పురోగతి సాధించింది. ఇక్కడ పేదలు గడిచిన నాలుగున్నరేళ్లలో ఏకంగా 1.87 శాతం తగ్గారు. పేదరికం ఇప్పుడు 4.19 శాతానికే పరిమితమైంది. నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించిన వాస్తవం. అంతేకాక ఇది జగన్ ప్రభుత్వం తెచ్చిన మార్పు.
కేంద్ర ప్రభుత్వం 9 పథకాల ద్వారా దేశ వ్యాప్తంగా 2019–21 ఆర్థిక సంవత్సంరో 14.96 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 11.28 శాతానికి తగ్గించిందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం నవరత్నాలతో 2019–21 ఏడాదిలో 6.06 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గించిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం డీబీటీ, నాన్ డీబీటీ స్కీమ్స్ ద్వారా పేదలకు రూ.4.21 లక్షల కోట్లను అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు స్కీమ్ర్స కారణంగా గత కొన్ని ఏళ్లుగా పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నీతి ఆయోగ్ నివేదిక వివరించింది.
పౌష్టికాహారం అందుతోందా? శిశు మరణాల రేటు ఎలా ఉంది? తల్లుల ఆరోగ్యం మెరుగుపడిందా? పాఠశాలలకు పిల్లల హాజరు శాతం ఎంత? వంటకు ఏ రకమైన ఇంధనం వినియోగిస్తున్నారు? పరిశుభ్రత పరిస్థితులు, తాగునీరు, గృహవసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలకు చెందిన బహుముఖ సూచికల ఆధారంగా పేదరికం శాతాన్ని నీతి ఆయోగ్ లెక్కగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందించటం, పారిశుద్ధ్యంతో పాటు ఉచిత విద్య, ఆరోగ్యం, పోషకాహారాలపై తీసుకుంటున్న చర్యలు కారణంగా పేదరికం శాతం గణనీయంగా తగ్గిందని నివేదికలో వివరించింది. ప్రజల జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉందని నివేదిక స్పష్టంగా పేర్కొంది.
జగన్ ప్రభుత్వం నవరత్నాల్లోని పథకాల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధిస్తోంది. దీంతో పేదరికం శాతం కూడా అదే స్థాయిలో తగ్గుతోంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా వడ్డీ భారం లేకుండా రుణాలు అందజేయటం జరిగింది. ఇలా పలు కార్యక్రమాలు చేపడుతూ వరుసగా నాలుగేళ్ల పాటు ఫోకస్ గా పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం అడుగులు వేసింది. అంతే కాకుండా నవరత్నాల్లో ప్రతి పథకం ద్వారా పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంతో చర్యలు తీసుకుంది.
బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవల్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవల విలువను ఏకంగా రూ.25 లక్షల పరిమితి వరకూ అందిస్తోంది. వీటన్నిటితో పాటు నవరత్నాల ద్వారా పేదలందరికీ 31.91 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో జరిగింది. అలానే వాటిలో పక్కా ఇళ్ల నిర్మాణాలనూ ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఇలా జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి పెద్ద పీట వేస్తూ అత్యధికంగా వ్యయం చేస్తుండటంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గుతోందని నీతి ఆయోగ్ వెల్లడించింది.
ఒక మహిళ ఆర్థికంగా నిలదొక్కుకుంటే… కుటుంబం బాగుపడుతుంది. ఒక కుటుంబ పరిస్థితి మెరుగుపడితే… ఊరు అభివృద్ధి చెందుతుంది. ఇలా రాష్ట్రం దేశం అభివృద్ది చెందుతుంది. ఇదే సిద్ధాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బలంగా నమ్మారు. అందుకే 2014 ఏప్రిల్ 11వ తేదీనాటికి బ్యాంకుకులో ఉన్న రుణం మొత్తాన్ని మహిళలు సక్రమంగా చెల్లిస్తే నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా కింద తిరిగి ఇచ్చేస్తానని ఇచ్చారు. దానిని తూచా తప్పకుండా సీఎం జగన్ పాటించారు. ఇలాంటి చారిత్రక్మ నిర్ణయాలు చాలవా… జగనన్న సంకల్పం ఎంతగొప్పదోని చెప్పడాని అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.