iDreamPost
android-app
ios-app

దేశంలో 70 శాతం క‌రోనా కేసులు 19 జిల్లాల్లోనే…

  • Published May 19, 2020 | 11:56 AM Updated Updated May 19, 2020 | 11:56 AM
దేశంలో 70 శాతం క‌రోనా కేసులు 19 జిల్లాల్లోనే…

దేశంలో నమోదువుతున్న 70 శాతం కరోనా వైరస్‌ కేసులు కేవలం 19 జిల్లాల్లోనే నమోదవుతున్నాయని నీతి ఆయోగ్‌ సిఈఓ అమితాబ్‌ కాంత్ వెల్ల‌డించారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 50 శాతానికి పైగా ముంబాయి, ఢిల్లీ, అహ్మదాబాద్‌, చెన్నై, థానే నగరాల్లోనే నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక తీవ్ర‌త‌ ముంబాయి నగరంలో కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

క‌రోనా అధికంగా ఉన్న 19 జిల్లాలు ఇవే…

ముంబాయి (మ‌హారాష్ట్ర)
ఢిల్లీ (ఢిల్లీ)
అహ్మ‌దాబాద్ (గుజ‌రాత్‌)
చెన్నై (త‌మిళ‌నాడు)
థానే (మ‌హారాష్ట్ర)
పుణే (మ‌హారాష్ట్ర)
ఇండోర్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)
జైపూర్ (రాజ‌స్థాన్‌)
కల‌క‌త్తా (ప‌శ్చిమ బెంగాల్‌), సూర‌త్ (గుజ‌రాత్‌)
జోథాపూర్ (రాజ‌స్థాన్‌)
హైద‌రాబాద్ (తెలంగాణ‌)
ఔరంగ‌బాద్ (మ‌హారాష్ట్ర)
భోపాల్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)
ఆగ్రా (ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌)
నాసిక్ (మ‌హారాష్ట్ర)
వ‌డోద‌ర (గుజ‌రాత్‌)
క‌ర్నూల్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)
తిరువ‌ల్లూర్ (త‌మిళ‌నాడు)

ప్రైవేట్ రంగాన్ని, ఎఫ్‌డిఐల‌ను ఆక‌ర్షించండి

కరోనా విపత్కర పరిస్థితుల్లో కార్మిక శక్తి అధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాు స్థానికంగానే కొత్త ఉద్యోగా కల్ప‌న‌ కోసం వీలైనంత తొందరగా భారీ సంస్కరణలు చేపట్టాని ఆయన సూచించారు. పారీశ్రామికీకరణ, స్మార్ట్‌ పట్టణీకరణపై దృష్టి పెట్టాల‌ని, ప్రైవేట్‌ రంగం, ఎఫ్‌డిఐ పెట్టుబడుల‌ను ఆకర్షించడానికి సరైన వాతావరణాన్ని సృష్టించాల‌ని సూచించారు.

దేశంలో ప్రతి పది ల‌క్షల‌ మందికి ఇద్దరే మృతి

కేసు సంఖ్య ఎన్ని ఉన్నాయన్నది ముఖ్యం కాదని, వీటితో సంభవించే మరణాలు, కోలుకుంటున్నవారి శాతమే కీల‌కమని నీతి ఆయోగ్‌ సిఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. ఈ రెండింటిలోనూ భారత్‌ మెరుగైన ఫలితాల‌తో ముందుకు వెళ్తోందన్నారు. అమెరికాలో ప్రతి పది ల‌క్షల‌ మందికి 275 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, స్పెయిన్‌లో 591 మంది మరణిస్తున్నారని గుర్తు చేశారు. వీటితో పోలిస్తే భారత్‌లో ప్రతి పది ల‌క్షల‌ మందికి ఇద్దరే ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కోవిడ్‌-19 మరణాల‌ రేటు ఫ్రాన్స్‌లో 16 శాతం ఉండగా, భారత్‌లో ఇది మూడు శాతం మాత్ర‌మే ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్‌లో ఈ వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 38 శాతంగా ఉందని అమితాబ్‌ కాంత్‌ తెలిపారు.