ఎప్పుడో 1957లో వచ్చిన సినిమా గురించి ఇప్పటి తరం మాట్లాడుకుంటున్నారంటే దాని సృష్టికర్త కెవి రెడ్డి ప్రభావం ఆ స్థాయిలో ఉంది. స్క్రీన్ ప్లేకు తిరుగులేని గ్రామర్ బుక్ గా ఇప్పటికీ ఎందరో దర్శకులు దాని వెనుక ఉన్న రహస్యాలను చేధిస్తూనే ఉన్నారు. రచయితలు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. కథ మొత్తం పాండవులకు సంబంధించినదే అయినా అసలు వాళ్ళను చూపించకుండా కేవలం అభిమన్యుడు ఘటోత్ఘచుడులు కౌరవుల కన్నుగప్పి శశిరేఖను ఎలా తీసుకొచ్చారనే కథను ఆవిష్కరించిన వైనం ఎప్పటికీ […]
తెలుగు చలనచిత్రరంగానికి ఒక ఊపును, మెరుపును దిద్దిన మహనీయుడు కదిరి వెంకటరెడ్డి. ఆయన చిత్రరంగంలో కె.వి. గా చిరపరిచితుడు. ‘భక్తపోతన’, ‘పాతాళభైరవి’, ‘పెద్దమనుషులు’, ‘మాయాబజార్’, ‘దొంగరాముడు’, ‘జగదేకవీరుని కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ వంటి సినిమాలను ఒక్క పాతతరమే కాదు నేటి ఆధునిక తెలుగు ప్రేక్షకుడు కూడా మరచిపోలేరు. ఆ రోజుల్లోనే ఆధునిక వివాహ వ్యవస్థ మీద ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రం నిర్మించి ప్రశంసలు అందుకున్న మహానీయుడాయన. ఆయన సినిమాలు రంగుల కాలంలో రాలేదు… కానీ ఆ బ్లాక్ […]