స్టార్ హీరోలతో సెంటిమెంట్ సినిమాలు వర్కౌట్ కావేమో అనుకుంటాం కానీ సరిగా ప్లాన్ చేసుంటే క్లాస్ మాస్ ఆదరిస్తారని చెప్పడానికి ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి విజేత. 1985 ఫిబ్రవరిలో అనిల్ కపూర్ హీరోగా ‘సాహెబ్’ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది. అనిల్ గంగూలీ దర్శకులు. బెంగాలీలో వచ్చిన విజయవంతమైన చిత్రానికి ఇది రీమేక్. దీన్ని తెలుగు రీమేక్ చేసే ఉద్దేశంతో హక్కులు కొన్నారు నిర్మాత అల్లు అరవింద్. అప్పటికే చిరంజీవికి మాస్ […]
1979 ‘శంకరాభరణం’ ప్రభంజనం తర్వాత దర్శకులు కళాతపస్వి కె విశ్వనాథ్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక ముసలాయన్ని హీరోగా పెట్టి సంగీత భరిత సినిమా తీస్తే బాషా భేదం లేకుండా క్లాసు మాసు అందరూ దానికి నీరాజనాలు పట్టడం గురించి అంతర్జాతీయ వేదికల మీద కూడా చర్చలు జరిగాయి. కమర్షియల్ సూత్రాలకు దూరంగా చేసిన ఈ ప్రయత్నం ఇప్పటికీ చెక్కుచెదరని పేరు ప్రతిష్టలు సంపాదించింది. తర్వాత విశ్వనాథ్ 3 చిత్రాలు చేశారు. సిరిసిరిమువ్వ హిందీ రీమేక్ ‘సర్గం’ […]