కరోనా వైరస్ ఇండియాలో ఇంకా అదుపులోకి రాని కారణంగా సినిమా థియేటర్లను తెరిచే విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. కఠిన నిబంధనలతో పరిమిత సీటింగ్ తో ఓపెన్ చేయించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ సింగల్ స్క్రీన్ ఓనర్ల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్ళీ సీటింగ్ మార్చుకుని శానిటైజేషన్ కోసం అదనపు భారాన్ని భరించేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నారట. మల్టీ ప్లెక్సులు మాత్రం అన్ని కండీషన్లకు సై అంటున్నాయి. నిర్వహణ భారంగా మారడంతో అధిక […]
ఇవాళ్టి నుంచి ఇండియాలో ప్రార్ధనా మందిరాలు, షాపింగ్ మాల్స్ క్రమంగా తెరుచుకుంటున్నాయి. కంటోన్మెంట్ జోన్లు మినహాయించి అన్ని చోట్ల జనజీవనం సాధారణం అయిపోతోంది. కేసుల పెరుగుదల మాట ఎలా ఉన్నా జనం దాన్ని పట్టించుకునే మూడ్ లో లేరు. ఇక బాలన్స్ ఉన్నది సినిమా థియేటర్లు మాత్రమే. ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎవరికీ తెలియదు. ప్రభుత్వాలు ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తాయా అని అన్ని బాషల నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మిగిలిన దేశాల్లో క్రమంగా ఆ దిశగా అడుగులు […]