iDreamPost
iDreamPost
నేపథ్యం:
1. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా సూచనలు, సలహాల కొరకు నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
2. రాష్ట్ర అభివృద్ధి కొరకు ఇంతకుముందు నియమించబడిన అనేక కమిటీల వారి సిఫార్సులను, ముఖ్యంగా శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను ఈ కమిటీ పరిశీలించడం జరిగింది.
3. APCRDA అధికారులతో పాటు, సెక్రటేరియట్ లోని అధికారులతో అభివృద్ది పనులు మరియు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు వాటి పరిస్థితిని నేరుగా పరిశీలించడం జరిగింది.
4. ప్రజాభిప్రాయ వ్యక్తీకరణ కొరకు ఆన్లైన్ లో ఒక వేదిక ఏర్పరిచి, ప్రజల స్పందనను కోరాము. ప్రజల నుండి పెద్ద సంఖ్యలో అభిప్రాయాలు సేకరించడం జరిగింది.
పరిచయం:
5. ఏక ప్రాంతాభివృద్ది వలన, నికర ధనం మొత్తం ఒకే చోట పెట్టడం వలన పట్టణీకరణ భావన పెరగడమే కాకుండా, మిగితా ప్రాంతాల్లో విద్య, వైద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాల కొరత రావడం వల్ల అక్కడి జీవన ప్రమాణాలు దిగజారిపోయి ఆర్థిక, ప్రాంతీయ అసమానతలు వచ్చే అవకాశమూ లేకపోలేదు.
6. ఉద్యోగాల కల్పన, రోడ్డు రవాణా కనెక్టివిటీ ద్వారా ఆర్థిక పరిపుష్టి కలిగిన ప్రాంతాలు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాల మధ్య నివాసయోగ్య ప్రమాణాల దూరం తగ్గించడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం.
7. UN Sustainable Development Goals (SDGs) యొక్క సిఫార్సు మేరకు భారతదేశం ఈ సమస్యలను గుర్తించి వాటిని నివారించేందుకు ప్రణాళికా లక్ష్యాలను ఏర్పరుచుకుని ముందుకు వెళ్లేలా ఉండాలి.
8. అభివృద్ధి యొక్క సామాజిక లక్ష్యాలు ఇప్పుడు ప్రజాస్వామ్యంపై ఆధారపడి ఉన్నాయి మరియు ప్రతిపాదిత సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిలో ఈ విలువలు సమర్థించబడ్డాయి.
9. ప్రణాళిక వ్యవస్థల అసమానతల వలన ప్రాంతాలు పట్టణ – గ్రామీణ వ్యవస్తగా విభజించబడ్డాయి. గతంలో జరిగిన ఇలాంటి అసమానతలకు తావు లేకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక, ప్రాంతీయ సమతుల్యత సాధించడమే ఈ ‘వికేంద్రీకృత పాలన’.
ప్రస్తుత నివేదికల సమీక్ష:
10. డాక్టర్ సివి శివరామకృష్ణ కమిటీ యొక్క నివేదికలోని ముఖ్యమైన సూచనలు మరియు సలహాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
a. ప్రభుత్వ కట్టడాలు, కార్యాలయాలు ఒకే చోట పెట్టాలనుకోవడంలో ఎలాంటి ప్రత్యేక లాభం లేదు.
b. అత్యాధునిక సమాచార వ్యవస్థ ద్వారా భౌగోళిక దూరాన్ని తగ్గించడంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఒక్క ఉదాహరణగా నిలిచింది. కావున ఈ సమయాన ప్రభుత్వ కార్యాలయాలు స్థాపించుటకు భౌగోళిక దూరం దూరం అనేది ప్రామాణికం కాకూడదు.
c. వికేంద్రీకృత అభివృద్ధికి, ఆర్థిక కారణాలతో VGTM పట్టణ ప్రాంతంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు సంప్రదాయాలు సమకూర్చుట అంత తేలికైన పని కాదు.
d. హైకోర్టు ప్రాంగణం విశాఖపట్నంలో ఉండాలనేది ఒక్క ఆప్షన్ మాత్రమే, హై కోర్టు మరియు సచివాలయం లేదా అసెంబ్లీ ప్రాంగణం ఒకే చోట ఉండాలని ఖచ్చితమైన నియమావళి ఏమి లేదు. హైకోర్టు పని నిమిత్తం అదే పనిగా వెళ్లే ప్రభుత్వాధికారుల సౌలభ్యం అనే కారణం చేత హైకోర్టు, సెక్రటేరియట్ ప్రాంగణం ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు.
e. ‘Green-Field’ రాజధానికి సంబంధించి, ప్రస్తుతానికి కమిటీ ఒక్క ప్రాంతాన్ని ఎంచుకొనటకు అనుకూలంగా లేదు.
f. ఆంధ్ర రాష్ట్రం వరకు పరిపాలనా పనితీరుకు అనుగుణంగా ఉండేవే వికేంద్రీకరణ కు ప్రథమ ఆధారంగా తీసుకొనబడుతుంది.
g. ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉన్న రాష్ట్రాలు, హై కోర్టులు రాజదాని బయట ఉన్న రాష్ట్రాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా, రాజధాని యొక్క విధులను ప్రాంతాల మధ్య సమతుల్యంగా పంచడం జరగాలి.
h. ఆంధ్ర ప్రదేశ్ తీరంలోని చాలా ప్రదేశాలు తుఫాను తాకిడికి గురవుతూ ఉన్నాయి, సముద్రపు నీటి మట్టం పెరుగుదల వలన, వాతావరణ మార్పులు వలన ఈ తాకిడి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు, కాబట్టి ఇలాంటి రాజధాని కొరకు ఇలాంటి ప్రదేశాలను పరిశీలించే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది.
11. ప్రజల ఆకాంక్షలు మరియు పరిపాలనా ప్రాధాన్యత జిల్లా సమావేశాలలో ఈ కింద చెప్పబడిన విధంగా ఉన్నాయి.
జోన్ 1:
శ్రీకాకుళం: విద్యా, పర్యాటకం, నీటిపారుదల మరియు విద్యుత్ సరఫరా.
విజయనగరం: శాసనసభ, విద్య, పర్యాటక రంగం.
విశాఖపట్నం: పరిశ్రమ, పట్టణాభివృద్ధి, పర్యాటక రంగం, స్మార్ట్ సిటీ మరియు మెట్రో రైలు.
జోన్ 2:
తూర్పు గోదావరి: పర్యాటకం, Capitive Port, Floriculture మరియు ఉద్యాన పద్ధతులు.
పశ్చిమ గోదావరి: వ్యవసాయం మరియు CADDLs (Community Animal Disuse
Detetion Labs).
కృష్ణ: పారిశ్రామిక, పోర్టు, సేవా రంగం, అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీ, భూగర్భ జలాలు.
జోన్ 3:
నెల్లూరు: నీటిపారుదల, పర్యాటక రంగం.
గుంటూరు: పరిశ్రమలు (సిమెంట్).
ప్రకాశం: నీటిపారుదల (బకింగ్‌హామ్ కెనాల్), పరిశ్రమ మరియు ఓడరేవు.
జోన్ 4:
అనంతపూర్: హార్టికల్చర్, ఐటి, ఎలక్ట్రానిక్స్ మరియు HOD లు.
కడప: నీటిపారుదల, మైనింగ్, ఆరోగ్యం, పరిశ్రమ(ఉక్కు మరియు సిమెంట్), మెగా సోలార్ పార్క్ మరియు ఇండస్ట్రియల్ క్లస్టర్స్.
కర్నూల్: హై కోర్టు, నీటిపారుదల, పరిశ్రమ (స్టీల్ అండ్ సిమెంట్), హార్టికల్చర్ మరియు WAQF కమిషనర్.
చిత్తూరు: నీటిపారుదల, తీర్థయాత్ర, పర్యాటక రంగం, స్మార్ట్ సిటీ.
12. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ప్రాంతం) పట్టణ ప్రణాళిక చట్టం, 1920 చాలా పాతది మరియు ప్రస్తుత పట్టణ అభివృద్ధి మరియు మెట్రోపాలిటన్ ప్రాంతీయ ప్రణాళిక యొక్క అవసరాలను తీర్చదు.
13. ఏపీ పట్టణ ప్రాంత అభివృద్ధి చట్టం, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్ (APMRUDA) మరియు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్ (APCRDA) ద్వారా అనేక పట్టణ అభివృద్ది మరియు మహానగర ప్రాంత అభివృద్ది అధికారాలు నిర్మించబడినవి.
14. ప్రతిపాదింపబడిన AP అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్ యాక్ట్ (2020), అమల్లోకి వచ్చినట్లైతే ఈ ఒక్క చట్టం ద్వారా మెట్రోపాలిటన్, ప్రాంతీయ, పట్టణ, ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి అధికారులతో పాటు ఈ ప్రాంతాల ప్రణాళిక ప్రయోజనం జరుగుతుంది.
15. పెరిగిన అటవీ పరిణామం మరియ సోషల్ ఫారెస్ట్రీ ప్రాధాన్యం ఉండాలి. షెల్టర్‌బెల్ట్ తోటల నివారణ ఉపయోగం సిఫార్సు చేయబడింది.
16. పూర్తి కావొచ్చిన నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగుభూమికి ఉపయోగపడేలా చేయాలి.
17. ముఖ్యమైన మానవ అభివృద్ధి సూచికల విషయంలో రాష్ట్రం అధిక పనితీరు కనబరచలేదు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో సైతం విద్య మరియు ఆరోగ్యం పొందడం ఒక సవాలు గా మారింది. అదనంగా, రాష్ట్రంలో తాగునీరు మరియు నీటిపారుదల నెట్‌వర్క్‌లు చాలా ప్రాంతాలకు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సవాలుగా మారాయి.
18. అభివృద్ది వికేంద్రికరణకు ప్రతిపాదించబడ్డ రాజధాని అనుకుల ప్రాంతాలు
అమరావతి –
హైకోర్టు బెంచ్
మంగళగిరి కాంప్లెక్స్ –
అసెంబ్లీ( సీతాకాల సమావేశాల నిర్వహణ)
గవర్నర్ బంగ్లా
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్
విశాఖపట్నం
హైకోర్టు బెంచ్
అసెంబ్లీ( వేసవికాల సమావేశాల నిర్వహణ)
సచివాలయం
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్
కర్నూల్
హైకోర్టు