Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. అమరావతిలోని సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెళ్లడించారు.
– రాజధానిపై హైలెవల్ కమిటీ ఏర్పాటు. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత హైలెవల్ కమిటీ రాజధానిపై మార్గదర్శనం చేస్తుంది.
– స్థానిక సంస్థల్లో ఎస్టీలకు 6.67 శాతం, ఎస్సీలకు 19.08, బీసీలకు 34 శాతం ప్రకారం రిజర్వేషన్లు.
– 412 కొత్త 108 వాహనాల కొనుగోలు. 71.48 కోట్లు కేటాయింపు.
– 656 కొత్త104 వాహనాలు కొనుగోలు. 60.50 కోట్లు కేటాయింపు.
– వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం నూతన విధానం. 191 వ్యవసాయ మార్కెట్,
150 ఉప మార్కెట్లను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్పు. ప్రతి సంవత్సరం మిర్చి, పసుపు, చిరు ధాన్యాలు, ఉల్లి తదితర పంటలకు ముందే మద్దతు ధర నిర్ణయం.
– సెంట్రల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్‌కు గన్నవరంలో స్థలం.
– వైఎస్సార్ కడప జిల్లా రాయచోటిలో నాలుగు ఎకరాలు రాష్ట్ర వక్ఫ్ బోర్టుకు బదలాయింపు.
– రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మచిలీపట్నం పోర్టు నిర్మాణం.
– 2014 డిసెంబర్ 31న రాజధాని ప్రకటన ముందు భూములు కొనుగోళ్లపై (ఇన్‌సైడ్ ట్రేడింగ్) విచారణ. న్యాయ నిపుణుల సలహా తర్వాత ఏ సంస్థకు విచారణకు ఇవ్వాలనేది నిర్ణయం.
– రామాయపట్నం పోర్టుకు అడ్డంకిగా ఉన్న కృష్ణ పట్నం సముద్ర ముఖ పరిధి కుదింపు.